పాక్ బలం, బలహీనత మాకు తెలుసు.. విజేతలుగానే ఫైనల్‌కు సిద్ధపడతామన్న కోహ్లీ

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంలో ఘోరంగా ఆడి భారత్ల చేతిలో చిత్తయినప్పటికీ అనూహ్యంగా కోలుకుని వరుసుగా మూడు మ్యాచ్‌లు గెలిచి అద్భుతమైన రీతిలో తుదిపోరుకు అర్హత సాధించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో తలపడటానికి తమ వ్యూహాల్లో కొత్త మార్పులు ఏవీ అవసరం లేదన

శనివారం, 17 జూన్ 2017 (02:22 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంలో ఘోరంగా ఆడి భారత్ల చేతిలో చిత్తయినప్పటికీ అనూహ్యంగా కోలుకుని
వరుసుగా మూడు మ్యాచ్‌లు గెలిచి అద్భుతమైన రీతిలో తుదిపోరుకు అర్హత సాధించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో తలపడటానికి తమ వ్యూహాల్లో కొత్త మార్పులు ఏవీ అవసరం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తేల్చి చెప్పాడు. పాక్ బలం, బలహీనతలు మాకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఆ ప్రాతిపదికనే మేం పథక రచన చేపడతామని, జట్టులో భారీ మార్పులు చేయవలసిన అవసరం లేదని కోహ్లీ తెలిపాడు.
 
భారత్, పాక్‌ హై ఓల్టేజి ఫైనల్‌ మ్యాచ్‌ గురించి మాత్రం కోహ్లి చాలా తేలిగ్గానే స్పందించాడు. ‘ఇప్పటిదాకా మేం కొనసాగించిన ఆటనే ఫైనల్లోనూ ప్రదర్శిస్తాం. పాక్‌ బలం, బలహీనతల గురించి మాకు తెలుసు. దానికి తగ్గట్టుగా మా ప్రణాళికలు ఉంటాయి. కానీ మ్యాచ్‌లో భారీ మార్పులు చేసుకోవాల్సిన అవసరం మాత్రం లేదు. సమష్టిగా మా ఆటతీరు అద్భుతంగా ఉంది. ఫైనల్‌ రోజు మా స్థాయికి తగ్గ ఆటను మైదానంలో కనబరిస్తే ఫలితం అదే వస్తుంది. ముందుగానే ఎవరినీ విజేతలుగా అంచనా వేయలేం. ఇప్పటిదాకా కొన్ని ఆశ్చర్యకర ఫలితాలను చూశాం’ అని కోహ్లి తెలిపాడు. 
 
చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌ ప్రదర్శన ఆకట్టుకుందని కొనియాడాడు. ఓ జట్టు మంచి క్రికెట్‌ ఆడితేనే ఫైనల్‌కు వస్తుందని, పరిస్థితులను వారికి అనుకూలంగా మలుచుకుని అద్భుత ఫలితాలను సాధించారని కొనియాడాడు. సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను సునాయాసంగా ఓడించి భారత్‌.. మరో సెమీస్‌లో ఊపుమీదున్న ఇంగ్లండ్‌ను మట్టికరిపించి పాక్‌ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ అనంతరం తాను సన్నద్ధమైన తీరు ప్రస్తుత టోర్నీలో ఫలితం చూపిస్తోందని చెప్పాడు. జట్టు పరిస్థితులకు తగ్గట్టుగా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధమేనని చెప్పాడు.
 

అన్నీ చూడండి

వైకాపా నేతలపై తాడేపల్లి పోలీస్ స్టేషనులో అట్రాసిటీ కేసులు

పెళ్లిని ఆపేందుకే కేతన్ అగర్వాల్ హత్య - మాస్టర్ మైండ్ సియా ప్రియుడు చైతన్

సూర్యాపేటలో ఓ జానెడు ఉన్న వ్యక్తి మిగిలిండు... : సీఎం రేవంత్ రెడ్డి

కొండెక్కిన గుడ్డు... తెలంగాణాలో అమాంతం పెరిగిపోయింది...

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

అన్నీ చూడండి

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

తర్వాతి కథనం
Show comments