సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (12:00 IST)

బాలికపై వృద్ధుడు అత్యాచారం...

తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. జిల్లాలోని వడ్డేపల్లి పరిమళకాలనీకి చెందిన బింగి భిక్షపతి(69) హైయర్ ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​లో సూపరింటెండెంట్​గా చేసి రిటైర్​ అయ్యాడు. 
 
వారి ఇంటి పక్కనే ఓ దివ్యాంగుడు కూతురితో కలిసి ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య కలహాలు రావడంతో కొద్దిరోజులుగా బాలిక తల్లి కుటుంబానికి దూరంగా ఉంటోంది. దీంతో బాలిక ఆలనాపాలన చూసేవాళ్లు కరువయ్యారు. 
 
దీన్ని ఆసరాగా తీసుకున్న భిక్షపతి బాలికకు కొద్దిరోజులుగా మాయమాటలు చెబుతూ అత్యాచారానికి పాల్పడసాగాడు. మంగళవారం బాలిక పేరెంట్స్​ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. వెంటనే పేరెంట్స్​ 100 కు కాల్​ చేసి సమాచారం ఇచ్చారు. 
 
పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో యాక్ట్​ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ జనార్ధన్​రెడ్డి చెప్పారు.