శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: శుక్రవారం, 4 మార్చి 2022 (15:42 IST)

మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్న కామాంధుడు, గంజాయి పీలుస్తూ...

తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. బామ్మ దగ్గరే ఉంటూ చదువుకుంటూ ఉండేది ఆ బాలిక. ఇంటి దగ్గరలో ఉన్న ఒక యువకుడు ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఆమెను లోబరుచుకున్నాడు. తన స్నేహితులతోను శారీరకంగా కలవాలని కోరాడు.


తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరానికి చెందిన వసంత్ గిరీష్ స్థానికంగా డెంటల్ కళాశాలలో చదువుతున్నాడు. తన ఇంటికి సమీపంలో 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఉండేది. తల్లిదండ్రులు మరణించడంతో ఆ యువతి అమ్మమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటూ ఉండేది.
 
బాలిక పాఠశాలకు వెళ్ళే సమయంలో వెంటపడే వసంత్ గిరీష్ ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ లో ఉన్న ఆ యువతి గిరీష్ కు బాగా దగ్గరైంది. అదే ఆమెకు శాపంగా మారింది. 
 
పాఠశాలకు వెళుతూ మధ్యలో ఆ యువకుడితో కలిసి వెళ్ళేది. గిరీష్ గంజాయి సేవించిన తరువాత ఆ యువతిని శారీరకంగా అనుభవించేవాడు. ఇలా నెలరోజుల పాటు సాగింది. గిరీష్ తన స్నేహితులకు ఈ విషయాన్ని చెప్పాడు. వారు కూడా ఆ బాలికతో కలవాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో రెజిత్, ప్రసన్న, విశాల్, రాకేష్, మంజునాథ్ వీరందరూ కలిసి ఆ బాలికకు మాయమాటలు చెప్పారు. నీకు ఏది కావాలన్నా తీసిస్తాం.. మాకు సహకరించమని ప్రాధేయపడ్డారు.
 
వారి మాటలకు ఆమె కరిగిపోయింది. వారితోను శారీరకంగా కలిసింది. పాఠశాలకు సరిగ్గా రావడం లేదంటూ ఉపాధ్యాయులు అమ్మమ్మ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో అమ్మమ్మ గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. విద్యార్థినిని వెంటపెట్టుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేసింది బామ్మ. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. యువతికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.