శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (22:55 IST)

సిని ప‌రిశ్ర‌మ‌కు కె.సి.ఆర్‌. మ‌రింత ప్రోత్సాహం ఇస్తున్నారు - ప‌వ‌న్ క‌ళ్యాణ్

KTR, pawan kalyan, talasani and others
బుధ‌వారం రాత్రి భీమ్లానాయ‌క్ ప్రీ రిలీజ్ వేడుక యూసుఫ్ గూడా పోలీస్ స్టేడియంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ, జై తెలంగాణ‌, జై ఆంధ్ర‌, జై భార‌త్ అంటూ ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. 
నిజ‌మైన క‌ళాకారుడికి  కులం, మ‌తం వుండ‌దు. రాజ‌కీయాలు క‌ళాకారుడికి కుద‌ర‌వు. ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ వున్న‌ప్పుడు చెన్నారెడ్డి వంటి పెద్ద‌లు చెన్నై నుంచి ఇక్క‌డ‌కు తీసుకువ‌చ్చారు. ఈరోజు ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్‌. మ‌రింత ప్రోత్సాహం అందిస్తున్నారు. అందుకు  కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాం. ఎప్పుడైనా ఏదైనా అవ‌స‌రం వుంటే త‌ల‌సాని ముందుండి చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని క‌ష్ట‌న‌ష్టాల‌ను ప‌రిష్క‌రిస్తున్నారు. 
 
నాకు సినిమా అన్నం పెట్టింది. ఇంత‌మంది అభిమానుల్ని బిక్ష‌గా పెట్టింది. అందుకే మ‌న రాష్ట్రం, ప్రాంతానికి, మ‌న వాళ్ళ‌కు ఎంతో చేయాల‌నుంది. సినిమాకంటే వేరే వృత్తి తెలీదు. సినిమానే డ‌బ్బు సంపాదించుకునే వృత్తి. తొలి ప్రేమ‌కు వ‌చ్చిన‌ప్పుడు ఎలా చేశామో అంతే బాధ్య‌త‌గా ప్ర‌జా జీవితంలో వుంటూనే ఈ సినిమా చేశాం. నిర్మాత‌లు చిన్న‌బాబు, వంశీ ద‌గ్గ‌రుండి నా పొలిటిక‌ల్ షెడ్యూల్‌కు మార్చుకుంటూ బ‌ల‌మైన మ‌ద్ద‌తు ఇచ్చారు. కృత‌జ్ఞ‌త‌లు. 
 
ప‌రిశ్ర‌మ క‌ద‌లివ‌స్తే, ఎంతో మంది క‌ళాకారులు వ‌స్తార‌నేందుకు న‌ల్గొండ నుంచి వ‌చ్చిన సాగ‌రే కార‌ణం. బ‌ల‌మైన సంగీతం అందించాడు త‌మ‌న్‌. మారుమూల క‌ళాకారుల్ని త‌మ‌న్ ద్వారా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చాం. త్రివిక్ర‌మ్‌, త‌మ‌న్‌, ద‌ర్శ‌కుడు ఇలా అంద‌రి స‌హ‌కారంతో తీసుకువ‌చ్చాం. 
ఈ సినిమా అహంకారానికి, ఆత్మ గౌర‌వానికి న‌డుమ మ‌డ‌మ తిప్ప‌ని యుద్ధం. మ‌ల‌యాళం అయ్య‌ప్ప‌మ్ కోషియం రీమేక్‌. దాన్ని తెలుగులో ఎడాప్ట్ చేసి ర‌చ‌న చేసిన త్రివిక్ర‌మ్‌కు మ‌న‌స్పూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు. ఆయ‌న లేక‌పోతే సినిమా లేదు. డానియ‌ల్ శేఖ‌ర్‌గా రానా, నిత్య‌మీన‌న్ అంద‌రూ బాగా చేశారు.ఈ సిని4మా మీకు న‌చ్చేలా వుంటుంద‌ని ఆశిస్తున్నాను.