గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 3 ఫిబ్రవరి 2024 (11:32 IST)

ప్రైవేటుకి వెళ్తున్న బాలికను లాక్కెళ్లి ఐదుగురు సామూహిక అత్యాచారం

Rape
సాయంత్రం పూట ప్రైవేటుకు వెళ్తున్న మైనర్ బాలికపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని గయాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. బాలిక సాయంత్రం వేళ ట్యూషన్ చెప్పించుకునేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆమెను దారిలో అడ్డగించారు. ఆ తర్వాత ఆమెను నిర్జన ప్రదేశానికి లాక్కెళ్లి ముగ్గురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఇంతలో అక్కడికి మరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిని చూసి అఘాయిత్యం చేసిన ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఆ ఇద్దరు కూడా బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత వారు కూడా అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు ఎలాగో అక్కడి నుంచి ఇంటికి చేరుకుని తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకి వివరించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు.