సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 జులై 2023 (12:18 IST)

ఏలూరులో నాలుగో తరగతి విద్యార్థి దారుణం హత్య

murder
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో దారుణ హత్య జరిగింది. పునిరామన్నగూడెంలోని గిరిజన సంక్షేమశాఖ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న నాలుగో తరగతి విద్యార్థి గోగుల అఖిల (9)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సోమవారం అర్థరాత్రి 12 గంటల తర్వాత విద్యార్థి హత్యకు గురైనట్టు తెలుస్తుంది. 
 
అయితే, ఎవరు... ఎందుకు హత్య చేశారనే కారణాలు తెలియాల్సి ఉంటుంది. ఇప్పటికే వసతి గృహ సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బుట్టాయగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
ఏకంగా ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎక్కడ?  
 
ఏటీఎం కేంద్రాన్ని పగులగొట్టి అందులోని డబ్బులు చోరీ చేసేందుకు ఎక్కువ సమయం పడుతుందని భావించిన కొందరు దొంగలు ఏకంగా ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లారు. ఈ యంత్రాన్ని ఓ ట్రక్కులో తరలించారు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నాసిక్‌లోని ఓ ఏటీఎం కేంద్రంలో చోరీ చేసేందుకు కొందరు దొంగలు ఏటీఎం సెంటరుకు వచ్చారు. అయితే, ఆ యంత్రం ఎంతకీ బద్ధలు కాకపోవడంతో ఏకంగా ట్రక్కులో ఎక్కించి దాన్ని ఎత్తుకెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
పైగా, సమన్‌గావ్‌ ప్రాంతంలోని ఆర్‌పీఎఫ్‌ శిక్షణ కేంద్రానికి సమీపంలో ఇది జరగడం గమనార్హం. దొంగతనం దృశ్యాలన్నీ సీసీటీవీలో నమోదయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా దొంగలు ఏటీఎంను ఎత్తుకెళ్లే సమయానికి అందులో ఎంత నగదు ఉందన్నదానిపై స్పష్టత రావాల్సివుంది.