1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 జులై 2023 (17:43 IST)

వివాహితను గర్భవతి చేసి.. ఆపై స్నేహితులతో కలిసి...

rambiri
ఓ వివాహితను గర్భవతి చేసిన కిరాతక ప్రియుడు.. తన స్నేహితులతో కలిసి అతి దారుణంగా హత్య చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆ వివాహిత ఒత్తిడి చేయడంతో ప్రియుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరట్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మీరట్‌కు చెందిన ఓ మహిళకు గత 2015లో వివాహమైంది. భర్తతో తరచుగా గొడవలు జరుగుతుండటంతో వివాహం జరిగిన ఒకయేడాదికే పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఆదేశ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, కాలక్రమంలో వివాహేతర సంబంధానికి దారితీయడంతో ఆమె గర్భందాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయసాగింది. 
 
ఆమెను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టంలేని ఆదేశ్.. ఏదో ఒక కుంటి సాకు చెబుతూ తప్పించుకుని తప్పించుకుంటూ వచ్చాడు. అయితే, దీంతో ఆమె తనను పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో తన స్నేహితులతో కలిసి ఆమెను హత్య చేసేందుకు ఆదేశ్ పథకం రచించాడు. ఇందులోభాగంగా, ఒకసారి మాట్లాడాలని తన ఇంటికి పిలిపించాడు. అక్కడకు వివాహిత రాగానే తన నలుగురు స్నేహితులతో కలిసి ఓ పెద్ద రాయితో దాడి చేశాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులు మూడు రోజుల తర్వాత గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు ఆదేశ్‌తో పాటు దీపక్, ఆర్యన్, సందీప్, రోహిత్‌లను అరెస్టు చేశారు.