సీక్రెట్‌గా మరో పెళ్ళికి సిద్ధమైన ప్రియుడు... మర్మాంగం కోసేసిన ప్రియురాలు
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో దారుణం జరిగింది. తనను ప్రేమ పేరుతో మోసం చేసి రహస్యంగా మరో పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమైన ప్రియుడి మర్మాంగాన్ని ప్రియురాలు కోసిపారేసింది. పక్కా ప్లాన్‌తో ఈ పనికి పాల్పడింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ జవానుగా పని చేస్తున్న బాధితుడు... బంధువుల అమ్మాయిని మూడేళ్లుగా ప్రేమిస్తూ ఇటీవల రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. ఈ నెల 23వ తేదీన మరో అమ్మాయిని పెళ్ళాడబోతున్నట్టు ప్రియురాలిని తెలిసింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమె ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.
పాట్నాలోని ఓ హోటల్‌లో కలుసుకుందామని ప్రియుడికి కబురు పంపింది. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో పదునైన ఆయుధంతో అతడి మర్మాంగాన్ని కోసేసింది. ఈ పఠాత్‌తో పరిణామంతో ప్రియుడు ఒక్కసారిగా షాకయ్యాడు. ఆపై బాధతో విలివిల్లాడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువతిని అరెస్టు చేశారు. బాధితుడిని ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.