ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (19:40 IST)

హోటల్ వీడియో లీక్.. ఫైర్ అయిన కోహ్లీ.. భేషరతుగా క్షమాపణలు

virat kohli
ట్వంటి-20 ప్రపంచ కప్ కోసం టీమిండియా పెర్త్ నగరంలోని క్రౌన్ టవర్స్ హోటల్‌లో బస చేసింది. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేని సమయంలో.. ఆయన గదిలో వున్న వస్తువులను వీడియో తీసి లీక్ చేశాడు. ఈ వీడియో లీక్ కావడంపై విరాట్ కోహ్లీ ఫైర్ అయ్యాడు. 
 
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కోహ్లీ ధరించే దుస్తులు, కళ్లద్దాలు, టోపీలు, బూట్లు, ఇతర వస్తువులన్నింటినీ ఓ ప్రదర్శనగా ఈ వీడియోలో చూపించారు. దీనిపై కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో హోటల్ యాజమాన్యం దిగివచ్చింది. 
 
కోహ్లీకి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్టు క్రౌన్ టవర్స్ హోటల్ మేనేజ్‌మెంట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనకు పాల్పడినవారిని గుర్తించామని తెలిపింది. వారిని విధుల నుంచి తొలగించామని, ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరుపుతున్నట్టు పేర్కొంది.