శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (14:22 IST)

చనిపోయిన వ్యక్తికి కోరనా టీకా వేశారట, ఎస్ఎంఎస్ పంపారు

కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు భారతదేశంలో టీకా కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో 18 ఏళ్లు పైబడిని ప్రతి ఒక్కరికీ టీకాలు వేయాలని అధికారులు సిబ్బందికి గట్టి సంకేతాలు ఇస్తున్నారు. దీనితో ఆ లక్ష్యాన్ని చేరుకోలేని కొంతమంది సిబ్బంది పక్కదారి పడుతున్నారు. టీకాలు వేయకుండానే వేసినట్లు దొంగలెక్కలు చూపుతున్నారు.
 
అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. గత జూలైలో చనిపోయిన వ్యక్తికి కరోనా టీకా వేసినట్లు మెసేజ్ పంపారు. అంతేకాదు, అదే కుటుంబంలోని వ్యక్తి రెండో టీకా కూడా వేసుకుంటే ఇప్పుడే మొదటి డోస్ వేసుకున్నట్లు మెసేజ్ పంపారు. దీనితో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. అధికారులకు విషయాన్ని చేరవేసారు.
 
ఐతే సాంకేతిక లోపం అంటూ సర్దిపుచ్చుకుంటున్నారు సిబ్బంది. కానీ టీకా వేయకుండానే వేసినట్లు తమకు మెసేజిలు రావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.