suvichar
✕

మరణశాసనం రాసిన మద్యంమత్తు!

Written By ఠాగూర్
Updated: సోమవారం, 30 డిశెంబరు 2024 (15:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సీపట్నంలో మద్యంమత్తు మరణశాసనం రాసింది. పీకల వరకు మద్యం సేవించిన తండ్రి కన్నకొడుకునే హత్య చేశాడు. స్థానిక పోలీసుల కథనం మేరకు... విశ్రాంత ఆర్మీ ఉద్యోగి కఠారి రమణ (70) పట్టణంలోని లక్ష్మీనగరులో ఉన్న ఓ అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. భార్య సత్యవతి కొన్నేళ్ల కిందట మరణించింది. వీరికి కుమారుడు భాస్కరరావు (32). కుమార్తె పావని ఉన్నారు. 
 
తండ్రీ, కొడుకు అపార్టుమెంట్‌లో కలిసే ఉంటున్నారు. కుమార్తె ధర్మసాగరం సమీపంలో ఉంటోంది. ఆమె అప్పుడప్పుడు వచ్చి తండ్రి, తమ్ముడు యోగక్షేమాలు తెలుసుకుని వెళ్లేది. వీరిద్దరికి వంట, ఇంటి పనులు చేసేందుకు పనిమనిషి వస్తుంది. భాస్కరరావు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు.
 
శనివారం రాత్రి కుటుంబానికి సన్నిహితుడైన జిలానీతో కలిసి ఇంట్లో మద్యం తాగారు. డబ్బు దుబారా చేస్తున్నావంటూ తండ్రి, కొడుకు ఒకరిపై ఒకరు కేకలు వేసుకున్నారు. మద్యం తాగడం పూర్తయ్యాక జిలానీ తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తండ్రికొడుకుల మధ్య వాగ్వాదం కొనసాగింది. కోపం అదుపు తప్పడంతో తండ్రి రమణ పూరీ కర్రతో కొడుకు తలపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. 
 
మద్యం మత్తులోనే రమణ తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. తెల్లారిన తర్వాత మెళకువ వచ్చాక బయటకు వచ్చి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న కొడుకును చూసి బోరున విలపించాడు. కొద్దిసేపటికే ఇంటికొచ్చిన పనిమనిషికి రాత్రి జరిగినదంతా చెప్పాడు. ఆమె ఇచ్చిన సమాచారంతో స్థానిక పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

అన్నీ చూడండి

Nani party :విడుదలకు ముందే అలియాస్ రుక్మిణి టీమ్ బ్లాక్ బస్టర్ పార్టీ. చేసుకుంది

Varanasi update :వారణాసి సి.జి. పనులు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి

Sriram: ఇటీవల కాలంలో నేను చేసిన క్వాలిటీ ఫిలిం ది మేజ్ : శ్రీరామ్

Allu Arjun : ఇంటి లో మామూలుగానే ఉంటారు. కానీ సినిమా నచ్చితే ఎక్సైట్ అవుతారు : అల్లు అర్జున్

మేమిద్దరం భార్యాభర్తలమే కానీ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నాం : రమ్యకృష్ణ

తర్వాతి కథనం
Show comments