సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 29 డిశెంబరు 2024 (13:35 IST)

Pushpa-2: పుష్పపై సెటైరికల్ సాంగ్: టిక్కెట్‌లు మేమే కొనాలి.. సప్పట్లు మీకే కొట్టాలి...(video)

Pushpa 2
Pushpa 2
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో.. ఈ ఘటనపై సెటైరికల్‌గా ఒక ప్రైవట్ పాట రిలీజైంది. "టిక్కెట్‌లు మేమే కొనాలి.. సప్పట్లు మీకే కొట్టాలి. సావులు మేమే చూడాలి.. సల్లంగా మీరే ఉండాలి" అంటూ సాగే ఈ పాట అల్లు అర్జున్‌ ఘటన చుట్టునే తిరుగుతుంది. 
 
అలాగే యాక్షన్స్ కూడా పుష్ప మ్యానరిజంను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా లిరిక్స్ మొత్తం సినిమా వాళ్లది తప్పు అనే యాంగిల్‌లో ఉన్నాయి. ఈ పాట ఏ స్థాయిలో విమర్శలకు దారి తీస్తుందో చూడాలి మరీ. ప్రస్తుతం ఈ పాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
 
ఈ నెల 4న పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్ మీద విడుదలైన సంగతి తెలిసిందే. అంతేకాదు 14 రోజుల పాటు అల్లు అర్జున్‌కు జ్యూడిషియల్ రిమాండ్ కూడా విధించారు. 
 
అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరగా తదుపరి విచారణను ఈనెల 30కి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.