Pawan Kalyan Daughter: తండ్రి పవన్‌కు తగ్గ తనయ అనిపించుకున్న ఆద్య కొణిదెల (video)
సింప్లిసిటీకి ప్రత్యక్ష సాక్ష్యం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే పద్దతిని కొనసాగిస్తున్నారు పవన్ కల్యాణ్. ఇదంతా నటన అని.. కావాలనే కెమెరాల కోసం చేస్తుంటారనే విమర్శలు కూడా ఉన్నాయి. వాటిని పక్కనపెడితే.. సింప్లిసిటీలో తండ్రికి తగ్గ తనయ అనిపిస్తోంది పవన్ కళ్యాణ్ రెండో భార్య కూతురు ఆద్య. తాజాగా తల్లితో కలిసి కాశీ ప్రయాణం చేసిన ఆద్య వీడియో వైరల్ అవుతోంది.
కాశీలో ఆటో రిక్షాలో ప్రయాణించిన వీడియోను రేణు దేశాయ్ షేర్ చేశారు. కారులో ప్రయాణించే ఆర్థిక స్థోమత ఉన్నా అంత అవసరం లేదని, తన తల్లితో కలిసి సింపుల్‌గా ఆటోలో ప్రయాణించి ఆద్య మరోసారి వార్తల్లో నిలిచింది. పవన్ కళ్యాణ్‌కి తగ్గ కూతురు అంటూ గతంలోనూ పలు సార్లు ఆద్య నిలిచింది.
తన తండ్రికి తగ్గ తనయ అంటూ మరోసారి ఇలా సింప్లిసిటీ విషయంలో నిలిచిన ఆద్యపై సోషల్ మీడియాలో ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.