ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 మే 2024 (15:06 IST)

బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టుకున్న కుమారుడిని హత్య చేసిన తండ్రి.. ఎక్కడ?

murder
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టుకున్న కుమారుడిని కన్నతండ్రి ఇనుప రాడ్‌తో కొట్టి చంపేశాడు. తండ్రి పలుమార్లు హెచ్చరించినప్పటికీ కుమారుడు తీర్చు మార్చుకోకపోగా ఇల్లు, ఫ్లాట్‌ను కూడా అమ్మే వచ్చిన డబ్బును బెట్టింగుల్లో పోగొట్టుకున్నాడు. దీంతో ఆగ్రహించిన తండ్రి.. కన్నబిడ్డను కొట్టి చంపేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండలం, బగిరాత్ పల్లికి చెందిన ముకేశ్ కుమార్ (28) అనే వ్యక్తి బెట్టింగ్, జల్సాలకు బాగా అలవాటు పడ్డాడు. ఈ విషయం తెలిసిన తండ్రి హెచ్చరించినా వ్యసనాలకు దూరంగా ఉండలేకపోయాడు. బెట్టింగ్ మాయలో పడి రూ.2 కోట్ల వరకు పోగొట్టుకున్నాడు. 
 
ఎన్నిసార్లు చెప్పినా కుమారుడు ప్రవర్తన మార్చుకోకపోవడంతో గత రాత్రి ముకేశ్‌పై తండ్రి ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ముకేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే ఉద్యోగి అయిన ముకేశ్.. బెట్టింగులకు బానిసై ఇల్లు, ఫ్లాటును అమ్మేశాడు. కాగా, ముకేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.