బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (22:55 IST)

నన్ను మోసం చేసాడు, పెళ్లి ఆపండన్న యువతి జుట్టు పట్టుకుని ఈడ్చేసారు

woman victim
ఖమ్మం బైపాస్ రోడ్డులో ఓ యువతిని పలువురు జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ బయటపడేసారు. ఆమె తను మోసపోయానంటూ కేకలు వేస్తోంది. ఏం జరిగిందంటే...

 
ఖమ్మం బైపాస్ రోడ్డులోని కృష్ణా ఫంక్షన్ హాలులో పెళ్లి జరుగుతోంది. ఇంతలో ఆ పెళ్లి మండపానికి ఓ యువతి వచ్చింది. తనను మోసం చేసి మరో యువతితో గుట్టుగా పెళ్లి చేసుకుంటున్న తన ప్రియుడి పెళ్లి ఆపాలని కేకలు వేసింది. దీనితో వరుడు తరుపు బంధువులు ఆమెను బయటకు తోసేసారు. జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లారు.

 
బాధితురాలి పేరు రజినీ, పెళ్లి చేసుకుంటున్న వరుడు పేరు శ్రీనాథ్. శ్రీనాథ్ తనను గత ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్నాడనీ, ఇపుడు వేరే అమ్మాయితో గుట్టుగా పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదంటూ కన్నీటిపర్యంతమవుతూ మీడియా ముందు బోరున విలపించింది.