సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (15:39 IST)

ముంబైలో దారుణం : బాలికపై హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తి అత్యాచారం

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఓ బాలికపై ఎయిడ్స్‌తో బాధఫడుతున్న కామాంధుడు అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ బాధితారులు స్వయానా ఆయన కుమార్తె కావడం గమనార్హం. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
సౌత్ ముంబైలోని బాంబే హాస్పిటల్‌లో సమీపంలో ఓ పూరిగుడిసెలో ఓ వ్యక్తి నివసిస్తున్నారు. ఈయన హెచ్ఐవీ పాజిటివ్‌తో బాధపడుతున్నాడు. అయితే, తనతో పాటు ఆ గుడిసెలో ఉండే కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి కూడా హెచ్ఐవీతో బాధపడుతుంది. 
 
తల్లిలోని సమయంలో ఆ బాలికపై అత్యాచారం జరిగింది. అయితే, లైంగికదాడికి పాల్పడిన తర్వాత ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని కామాంధుడు ప్రాధేయపడ్డాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.