శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: శనివారం, 5 మార్చి 2022 (14:03 IST)

తరచూ పుట్టింటికి వెళ్తున్న భార్య, ఆమె వెనకాలే ఫాలో అయిన భర్త నిజం తెలిసి...

అతను అందగాడు. బాగా చదువుతున్నాడు. ఆ కాలనీలోనే అతనికి మంచి పేరుంది. దీంతో పక్కింట్లో ఉన్న యువతి అతనికి కనెక్టయ్యింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. కానీ బయట పడలేదు. ఇదిలావుండగానే ఆ యువతికి పెద్దలు వివాహం చేసేశారు. అయిష్టంగానే భర్తతో కాపురం చేసినా ప్రియుడిని మాత్రం వదులుకోలేదు వివాహిత. తరచూ పుట్టింటికి వస్తూ ప్రియుడితో ఏకాంతంగా కలుస్తూ వుండేది. చివరకు...

 
కర్నూలుజిల్లా ఆదోనికి చెందిన సునీతకు, కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి చెందిన సురేష్‌కు రెండుసంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇంకా పిల్లలు పుట్టలేదు. బళ్ళారిలోనే నివాసముంటోంది ఈ కుటుంబం.

 
అయితే సునీత తరచూ పుట్టింటికి వెళతానంటూ భర్తతో గొడవపెట్టుకునేది. పెళ్ళయినప్పటి నుంచి అదే తంతు. పెళ్ళయి రెండు సంవత్సరాలవుతున్నా అదే పరిస్థితి. దీంతో భర్తకు అనుమానం వచ్చింది. 

 
భార్యను పుట్టింటికి పంపాడు. ఆమెకి తెలియకుండా వెనకాలే తను వెళ్ళాడు. తను వచ్చే విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. భార్యను ఫాలో అయ్యాడు. అప్పుడే తన భార్య ప్రియుడు మూర్తి వ్యవహారం బయటపడింది. పెళ్ళికి ముందే తన భార్య మూర్తికి కనెక్టయినట్లు గుర్తించాడు.

 
తనను నమ్మించి మోసం చేస్తున్న భార్యను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వచ్చిన భార్యతో ప్రేమగానే ఉన్నాడు. బాగా నిద్రపోతున్న సమయంలో ఆమె గొంతు నులిమి ఊపిరాడకుండా చేసాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఫ్యాన్‌కు ఉరి వేశాడు.

 
ఆ తరువాత పోలీసు స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. తన భార్య అక్రమ సంబంధం కారణంగా ఆమెను చంపేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. తన భార్యను ఎలా చంపాడన్న విషయాన్ని కూడా పోలీసుల ముందు ఒప్పేసుకున్నాడు నిందితుడు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.