Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంతకీ పెళ్లి కావడంలేదని సూసైడ్ చేసుకున్న సాఫ్ట్వేర్ టెక్కీ

Written By ఐవీఆర్
Updated: శుక్రవారం, 27 ఆగస్టు 2021 (13:07 IST)
ఈమధ్య కాలంలో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం అనేది పెద్ద సవాలుగా మారిపోతుంది. కుర్రవాడికి అన్నీ వున్నా చాలాచోట్ల తగిన పిల్ల దొరకడంలేదు. ఇలాంటి పరిస్థితి ఓ యువకుడికి ఎదురైంది. దాంతో తనకు పెండ్లి కావడం లేదన్న బాధతో అతడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
పూర్తి వివరాలు చూస్తే... తెలంగాణలోని కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌కు చెందిన 28 ఏళ్ల ఆకుల రాజ్ కుమార్ ముంబై మహానగరంలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. కుర్రాడు కాస్త హ్యాండ్సమ్, ఉద్యోగం వుండటంతో ఇక మావాడి పెళ్లి ఖాయం అనుకున్నారు పెద్దలంతా.
 
కానీ అతడికి తగిన సంబంధం దొరకలేదు. ఏళ్లు గడుస్తున్నా పెళ్లి కావడంలేదని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా మృతి చెందడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments