బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (12:29 IST)

19 మంది మహిళలను మోసం చేసిన 'పియానో' విలియన్స్ అరెస్టు

తెలంగాణా రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ చర్చికి వచ్చే మహిళలను మాయమాటల ద్వారా లొంగదీసుకుని లైంగికంగా వాడుకుంటున్నారని నల్గొండకు చెందిన విలియమ్స్‌పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
చర్చిలో పియానో వాయించే విలియమ్స్‌ అక్కడికి వచ్చే మహిళలను మాయమాటలతో లొంగదీసుకున్నాడని ఈనెల 5న ఫిర్యాదు అందినట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తుండగా గుండెపోటు వచ్చిందని విలియమ్స్‌ ఆసుపత్రిలో చేరాడు. 
 
ఆరోగ్య పరీక్షల్లో గుండె పోటు వచ్చినట్టు నిర్థరణ కాకపోవడంతో పోలీసులు విలియమ్స్‌ను అరెస్టు చేశారు. అతని భార్య, కుటుంబ సభ్యులు మాత్రం.. డబ్బుల కోసమే మహిళ ఫిర్యాదు చేసిందని, ఎప్పుడూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తుందని ఆరోపిస్తున్నారు.