ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 27 నవంబరు 2021 (21:07 IST)

భార్యతో ఎస్సై ఎఫైర్, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితక్కొట్టారు

నేరాలను, ఘోరాలను అరికట్టాల్సిన పోలీసు అధికారి పక్కదారి పట్టాడు. మరొకరి భార్యపై కన్నేసాడు. ఆమెను మెల్లిగా లొంగదీసుకుని ఆమెతో వివాహేతర సంబంధం సాగించడం మొదలుపెట్టాడు. విషయం భర్తకు తెలిసినా సదరు వ్యక్తి పోలీసు అధికారి కావడంతో అదను కోసం వేచి చూచాడు.

 
తను లేనప్పుడు నేరుగా ఇంట్లోకి వెళ్లి భార్యతో ఏకాంతంగా వున్న సమయంలో తన స్నేహితులకు సమాచారం అందించాడు. అంతా కలిసి సదరు ఎస్సైని చితక్కొట్టుడు కొట్టారు. ఈ ఘటన వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో జరిగింది.

 
తన భార్యతో వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్న ఎస్సై షఫీని ఆమె భర్త చితక్కొట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో అతడిని సస్పెండ్ చేసారు.