Daily Horoscope
✕

తిరుపతిలో దారుణం - భార్యను చంపి సూట్‌కేసులో కుక్కిన టెక్కీ

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 31 మే 2022 (18:16 IST)
తిరుపతిలో దారుణం జరిగింది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కట్టుకున్న భార్యను కడతేర్చాడు. పక్కా ప్లాన్‌తో హత్య చేసిన కిరాతక భర్త.. శవాన్ని సూట్‌కేసులో కుక్కి చెరువులో పడేశాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు ఊచలు  లెక్కిస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతికి చెందిన వేణుగోపాల్ అనే టెక్కీకి పద్మావతి అనే యువతితో 2009లో వివాహమైంది. ఆ తర్వాత వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో పోలీసులు ఓసారి భార్యాభర్తలకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చి పంపించారు. 
 
అయినప్పటికీ వారి మధ్య గొడవలు సద్దుమణగ లేదు. దీంతో పద్మావతి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో వేణుగోపాల్ అక్కడకు వెళ్లి భార్యకు నచ్చజెప్పి తనతో పాటు తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పద్మావతిని చంపేసి, శవాన్ని సూట్‌‍కేసులో కుక్కి తిరుపతి శివారు ప్రాంతమైన వెంకటాపురంలో చెరువులో పడేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయాడు. పైగా, అత్తమామలను తన భార్య తనతోనే ఉన్నట్టు నమ్మించాడు. 
 
అయితే, గత ఐదు నెలలుగా కుమార్తె నుంచి ఎలాంటి ఫోను రాకపోవడంతో సందేహించిన పద్మావతి తల్లిదండ్రులు తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... వేణుగోపాల్‌ను తిరుపతికి పిలిచి విచారించగా, హత్య చేసినట్టు అంగీకరించాడు. 
 
ఆ తర్వాత నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు చెరువులో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న పద్మావతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమ కుమార్తె కట్టుకున్న భర్త చేతిలోనే దారుణ హత్యకు గురికావడం మృతురాలి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

అన్నీ చూడండి

King 100 Update: నాగార్జున కింగ్100 స్టైలిష్ కౌంట్‌డౌన్ పోస్టర్‌తో విడుదల ఖరారు

Vijay Antony: నాన్న కుట్టి అందరికీ నచ్చేలా ఉంటుంది : విజయ్ ఆంటోని

నీ కలను నెరవేరుస్తా, బిగ్ బాస్ బ్యూటీతో సల్మాన్ ఖాన్

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ధనుష్ వెల్ఫేర్ యూనిట్లు

Vijay Sethupathi :ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవంలో తొలి భారతీయ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి

తర్వాతి కథనం
Show comments