Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదే.. చెప్పిందెవరో తెలుసా?

Updated: సోమవారం, 26 ఆగస్టు 2019 (11:36 IST)
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌కు అప్పగించాలని సోషల్ మీడియాలో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో శ్రీభరత్.. జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 
 
టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని, ఒకవేళ ఆయన అవసరం ఉందనుకుంటే.. పార్టీలోకి ఆయన వచ్చే ఉద్దేశం వుంటే అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని భరత్ వ్యాఖ్యానించారు. తనతో పాటు ఎవరికైనా పార్టీనే సుప్రీం అన్నారు. ఎన్టీఆర్ జనాలను ప్రభావితం చేసే వ్యక్తి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవమే. 
 
కానీ రాజకీయాల్లోకి రావాలంటే.. అధినేత ఆలోచించి, పలానా వ్యక్తి రావాలని భావించాలి. అలాగే పార్టీలోకి రావాలని వచ్చే వ్యక్తి (ఎన్టీఆర్) కూడా అనుకోవాలన్నారు. అయినా జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి అవసరం లేదన్నారు. ఎన్టీఆర్ వస్తేనే టీడీపీకి మంచిదంటే తాను ఒప్పుకోనున్నారు. యువ నాయకులే కాస్త ప్రతిభ కనబరిచి కొత్త ఆలోచనలు చేయగలిగితేనే పార్టీని బలోపేతం చేసుకోవచ్చునని భరత్ వ్యాఖ్యానించారు.

అన్నీ చూడండి

Geethu Mohandas: టాక్సిక్ బెంగళూరు స్క్రీనింగ్‌లో గీతూ మోహన్‌దాస్ కన్నీళ్లు - మరో చిత్రానికి రెడీ

GV Narayana Rao: సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు కన్నుమూత - ఇండస్ట్రీ సంతాపం

Prakash Raj: డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్ సినిమా ఫాదర్ టీజర్ రిలీజ్

king 100: నాగార్జున పుట్టినరోజు న కింగ్ 100 మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Mandadi teaser: విజువల్స్, బోట్ సీక్వెన్స్ తో సుహాస్, సూరి ల మండాడి టీజర్

తర్వాతి కథనం
Show comments