సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: గురువారం, 14 సెప్టెంబరు 2017 (12:56 IST)

పవన్ కళ్యాణ్ 'జనసేన'కు మెగాస్టార్ చిరు పొలిటికల్ కెరీర్‌తో తలనొప్పి...

తెలిసిన విషయమే. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసి చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడం, ఆ తర్వాత కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా కొన్నాళ్లు పనిచేయడం. మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ పదవీ కాలం వచ్చే మార్చి 2018తో ముగియనుంది. ఈ నేపధ్యంలో చిరంజీ

తెలిసిన విషయమే. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసి చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడం, ఆ తర్వాత కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా కొన్నాళ్లు పనిచేయడం. మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ పదవీ కాలం వచ్చే మార్చి 2018తో ముగియనుంది. ఈ నేపధ్యంలో చిరంజీవి తదుపరి వేసే స్టెప్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పైన ప్రభావం చూపనుంది. 
 
రాజ్యసభ పదవీ కాలం ముగిశాక చిరంజీవి ఇక సినిమాలకే పరిమితమైపోతే జనసేనకు ఇబ్బంది వుండదు. కానీ చిరంజీవి తిరిగి కాంగ్రెస్ పార్టీలో కొనసాగినా, లేదంటే మరే ఇతర పార్టీ తీర్థం పుచ్చుకున్నా పవన్ కళ్యాణ్ కు అది తలనొప్పిగా పరిణమించక తప్పదు. 
 
ఇదిలావుంటే చిరంజీవిని తమతమ పార్టీల్లోకి రప్పించుకునేందుకు అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమచారం. ఒకవేళ వారి ప్రయత్నాలు ఫలించి ఏదేనే పార్టీలో చిరంజీవి జాయిన్ అయితే మాత్రం జనసేనకు అది తలనొప్పిగా మారడం ఖాయం. అందుకే చిరంజీవి తదుపరి ఎలాంటి పొలిటికల్ పార్టీలో చేరకుండా సినిమాలకే పరిమితమైపోతే బావుంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.