Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

పవర్ స్టార్‌కు సీఎం పదవి రాబోతోందా? బీజేపీలోకి సేన అందుకేనా?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 17 జనవరి 2020 (13:07 IST)
రాష్ట్ర విభజన సమయంలో ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి చక్రం తిప్పిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. మళ్లీ ఏపీ రాజధాని కోసం బీజేపీతో చేతులు కలిపారు. అప్పట్లో ఏపీ అభివృద్ధి కోసం టీడీపీతో చేతులు కలిపిన పవన్.. ప్రస్తుతం రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కమలంతో చేతులు కలిపారు. అమరావతి రాజధాని మారకూడదని.. రైతుల మేలు కోసం రాజధాని నగరం మారకూడదని పవన్ నిర్ణయించారు. 
 
ఇందులో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన పార్టీలు పొత్తులతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. దీంతో జనసేన పార్టీల శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అటు బీజేపీ వర్గాల్లోనూ కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఆ పార్టీ కూడా కొంతలో కొంత ఉత్సాహంగానే ఉంది. బీజేపీతో జనసేనాని చేతులు కలిపిన తరుణంలో ఆయనే కాబోయే ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అంటూ జనసేన భావిస్తోంది. రాష్ట్రంలో బలం పుంజుకునే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. 
 
ఏపీలో బీహార్ తరహా ఫార్ములా అనుసరించాలని బీజేపీ పెద్దల యోచనగా ఉందని తెలుస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్ కల్యాణ్ పేరును ప్రతిపాదించే అవకాశం ఉందటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీహార్‌లో ఎన్డీఏ తరపున నితీష్ కుమార్‌ను సీఎం‌గా ప్రకటించి జేడీయూ‌తో పొత్తు పెట్టుకుని ఆ రాష్ట్రంలో బీజేపీ రాజకీయం చేస్తోంది.
 
రాష్ట్రంలో ప్రస్తుతానికి టీడీపీ, వైసీపీలు బలంగా ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. జనసేన మరో బలమైన ప్రత్యామ్నాయంగా బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు ప్రస్తుతం బీజేపీతో చేతులు కలపడం కలిసివస్తుందని జనసేన భావిస్తోంది.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments