మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (11:56 IST)

ప్రపంచ రక్తదాతల దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఏంటంటే?

World Blood Donor Day
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. సకాలంలో మీరు చేసే రక్తదానం ఓ నిండు ప్రాణాల్ని కాపాడుతుంది. రక్తదానంతో కొన్ని సందర్భాలలో తల్లి, శిశువు ఇద్దరి ప్రాణాలు దక్కుతాయి. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా 2004లో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించింది. అయితే జూన్ 14న రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఓ ప్రధాన కారణం ఉంది. 
 
రక్తవర్గాలను కనిపెట్టిన కార్ల్ లాండ్‌స్టీనర్ 1868లో ఇదే రోజున జన్మించారు. ఏబీఓ రక్తగ్రూపుల వ్యవస్థను ఆయన కనిపెట్టినందుకుగానూ, ఆయన సేవలకు గుర్తింపుగా నోబెల్ బహుమతి అందుకున్నారు. 
 
ప్రతి మనిషికి రక్తం అవసరం ఎంతైనా ఉంది. కానీ సందర్భాన్ని బట్టి రక్తాన్ని సేకరిస్తారు. కొన్ని అగ్రదేశాలలో సరైన సమయంలో కొన్ని గ్రూపులకు చెందిన రక్తం అందుబాటులో ఉండదు. దీని వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో ఆరోగ్యవంతులైన వ్యక్తులు ప్రతి మూడు నుంచి నెలల మధ్య కాలంలో రక్తదానం చేయాలని అందుకోసం ప్రత్యేకమైన రోజును డబ్ల్యూహెచ్‌వో తీసుకొచ్చింది. 
 
ప్రతి ఏడాది ఏదైనా ఒక థీమ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది. ఈ ఏడాది రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బీటింగ్ అనే థీమ్‌ను ప్రకటించింది.  