బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2022 (00:05 IST)

నిర్జల ఏకాదశి.. ఆ రోజున ఏం చేయాలి?

జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశిగా జరుపుకుంటారు. 2022 సంవత్సరంలో జూన్ 10వ తేదీన శుక్రవారం ఉదయం 7:25 గంటలకు శుభ ముహుర్తం ప్రారంభమవుతుంది. ఇదే ఏకాదశి మరుసటి రోజు అంటే 11 జూన్ 2022 శనివారం రోజున సాయంత్రం 5:45 గంటలకు ముగుస్తుంది. నిర్జల ఏకాదశి సమయంలో ఉండే ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. 
 
నిర్జల ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ముందుగా స్నానం చేసి సూర్య దేవునికి నీటిని అర్పించాలి. అనంతరం శ్రీ మహావిష్ణువుకు పూలు, పండ్లు, అక్షింతలు, చందనంతో పూజలు చేయాలి. 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని జపిస్తూ రోజంతా గడపాలి. ఆ తర్వాత విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకునేందుకు స్వామి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికీ అందించాలి. ఉపవాసం పూర్తయిన తర్వాతే నీటిని తాగాలి.
 
ఏకాదశి రాత్రి వేళ పురాణ కాలక్షేపంతో జాగరణ చేయాలని చేస్తుంటారు. ఇక ఉపవాస విరమణ సమయంలో ద్వాదశి నాడు బ్రాహ్మణులకు ఆహార పదార్థాలను దానంగా ఇస్తారు. అలాగే అతిథులను భోజనానికి పిలిచి, ఉపవాస వ్రతాన్ని విరమించడం వంటివి చేస్తారు. ఈ రోజున ఎవరైనా తమ శక్తి, సామర్థ్యం మేరక దానధర్మాలు చేస్తారు.