జగన్‌కు అధికారాన్ని అప్పజెప్పనున్న చంద్రబాబు.. ఎలా..?

వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో తెరాస, టీడీపీలు కలిసి పొత్తుపెట్టుకుంటే ఏపీలో అధికారాన్ని జగన్‌కు చంద్రబాబు బంగారు పల్లెంలో పెట్టి అప్పగిస్తుందన్నది రాజకీయ విశ్లేషకుల భావన. తెరాసతో టీడీపీ పొత్తు అనేది ఆత్

ఆదివారం, 5 నవంబరు 2017 (15:06 IST)
వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో తెరాస, టీడీపీలు కలిసి పొత్తుపెట్టుకుంటే ఏపీలో అధికారాన్ని జగన్‌కు చంద్రబాబు బంగారు పల్లెంలో పెట్టి అప్పగిస్తుందన్నది రాజకీయ విశ్లేషకుల భావన. తెరాసతో టీడీపీ పొత్తు అనేది ఆత్మహత్యతో సమానమని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబునాయుడు ఒక్కోసారి తీసుకునే అనాలోచిత నిర్ణయాలే తెలంగాణా రాష్ట్రంలో ఇబ్బందులకు కారణమవుతాయంటున్నారు ఆ పార్టీ నేతలు. 
 
పచ్చగా ఉన్న సమైక్య రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో తెలిసిందే. ఇదేవిధంగా చంద్రబాబు ఆలోచనలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతల నిర్ణయాలను బాబు కూడా ఫాలో అవుతున్నారా? అన్న అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చ జరుగుతుందంటే గత కొన్నిరోజుల ముందు టీడీపీలోని సీనియర్ నేతలు బాబుతో చర్చలు జరిపి వచ్చే ఎన్నికల్లో తెరాసతో కలిసి పోటీ చేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
 
ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీని తెలంగాణా రాష్ట్రంలో కనుమరుగుకాకుండా చేయాలంటే ఇది ఒక్కటే మార్గమన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే సీనియర్ నేతలు చెప్పిన వాటికి ఒకే అనేశారు బాబు. ముందు నుంచి ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన రేవంత్ పార్టీ మారిపోవడానికి కారణం కూడా ఇదే. పైగా, ఇపుడు తన నిర్ణయాన్ని ప్రశ్నించే వారు లేకపోవడంతో తెరాసతో కలిసిపోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు చంద్రబాబు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైన కేసీఆర్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏపీలో కూడా మూల్యం చెల్లించుకోకతప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి పరిస్థితుల్లో బాబు ఏ విధంగా ముందుకు వెళతారన్నది చర్చనీయాంశంగా మారింది. 

అన్నీ చూడండి

Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

తర్వాతి కథనం
Show comments