శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : ఆదివారం, 5 నవంబరు 2017 (12:58 IST)

వీడు మారడు: తెరాస కార్పొరేటర్ కొడుకు అభిషేక్ మళ్లీ అరెస్ట్

హైదరాబాద్ నగర అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కార్పొరేటర్ కుమారుడిని పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. అమ్మాయిల ఫొటోల మార్ఫింగ్, మహిళలను వేధించిన కేసులో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ నగర అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కార్పొరేటర్ కుమారుడిని పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. అమ్మాయిల ఫొటోల మార్ఫింగ్, మహిళలను వేధించిన కేసులో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజానికి ఇదే కేసులో నెలక్రితం అరెస్టు అయి ఆ తర్వాత బెయిల్‌పై రిలీజ్ అయ్యాడు. ఇపుడు మళ్లీ ఇదే తరహా కేసులో అరెస్టు కావడంతో వీడు మారడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 
హైదరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేటర్ తెరాసకు చెందిన జగదీశ్వర్ గౌడ్ కొనసాగుతున్నారు. ఈయన సుపుత్రుడు అభిషేక్ గౌడ్ అమ్మాయిలను వేధిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. కొన్నేళ్ల క్రితం తనతో కలిసి చదువుకున్న అమ్మాయిలతోనే పరిచయం చేసుకుని, వాళ్ల ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత విషయాలు తెలుసుకుని వేధించడం మొదలుపెట్టేవాడు. 
 
దీంతో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులకు దొరక్కుండా ఉండటానికి అభిషేక్ నగరంలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి ఇంటర్నెట్ కాల్స్ చేసేవాడు. ఫోన్ కట్ చేస్తే… వాళ్ల ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడు. నెల క్రితమే ఓ మహిళను వేధించిన కేసులో షీటీమ్ అభిషేక్‌ను అరెస్టు చేసింది.
 
ఈ కేసులో ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. బయటకొచ్చాక బుద్ధిమారలేదు. అమ్మాయిల ఫోటోలను మార్ఫ్ చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం మళ్లీ స్టార్ట్ చేశాడు. దీంతో కొందరు బాధితులు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభిషేక్‌ను ట్రాప్ చేసిన నాగోల్ దగ్గర అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు.