శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (10:52 IST)

హైదరాబాద్ నారాయణ కాలేజీ ధ్వంసం (వీడియో)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణకు చెందిన విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణకు చెందిన విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికితోడు... పలు కాలేజీల్లో పని చేసే మహిళా టీచర్లపై కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ మంత్రి మాత్రం పెదవి విప్పడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో ఇద్దరు మహిళా టీచర్ల పట్ల డీజీఎం అసభ్యంగా నడుచుకున్నట్టు వార్తలు వచ్చాయి. 
 
దీంతో ఆగ్రహించిన ఏబీవీపీ విభాగానికి చెందిన విద్యార్థులు హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీని ధ్వంసం చేశారు. ఈ కాలేజీలో పని చేసే ఇద్దరు మహిళా టీచర్లను డీజీఎం లైంగిక వేధింపులకు గురిచేసినట్టు వార్తలు రావడంతో ఆ విద్యార్థి సంఘం నేతలు కాలేజీలోకి ప్రవేశించి ఫర్నీచర్‌, కంప్యూటర్, టైబుల్స్‌ను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్‌లో వైరల్ అయింది. 
 
మరోవైపు... విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వివాదస్పదమైన నారాయణ విద్యాసంస్థలకు సంబంధించిన ఓ ఆడియో ప్రస్తుతం సంచలనం రేపుతోంది. సోషల్‌ మీడియాలో ఆ సంస్థలకు చెందిన ఆడియో టేప్‌ వైరల్‌గా మారింది. నారాయణ సంస్థల్లో జరుగుతున్న అనైతికక కార్యక్రమాలు ఆ ఆడియో ద్వారా బయటకు వెల్లడి కావడం మరోసారి చర్చనీయాంశమైంది. నారాయణ విద్యాసంస్థలకు సంబంధించిన ఇద్దరు ఉద్యోగుల సంభాషణ... ఇప్పుడు సోషల్‌మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.