సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2017 (09:36 IST)

పెళ్లికి నో చెప్పిందని.. ఫేస్ బుక్‌లో ఫోటో దొంగలించి.. ఫోన్ నెంబర్‌తో పాటు?

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. పెళ్లికి నిరాకరించిన యువతి ఫోటోను అశ్లీల వెబ్‌సెట్‌లో అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని జహనుమా గుల్జార్

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. పెళ్లికి నిరాకరించిన యువతి ఫోటోను అశ్లీల వెబ్‌సెట్‌లో అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతున్నాడు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని జహనుమా గుల్జార్‌నగర్‌కు చెందిన యూసుఫ్ ఆరు నెలల క్రితం బాధిత యువతి (22) వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చాడు.  అయితే పెళ్లికి ఆమె నిరాకరించడంతో.. కక్ష పెంచుకున్న యూసుఫ్ ఆమె ఫేస్‌బుక్ ఖాతాలోని ఫొటోను దొంగిలించి, ఫోన్ నెంబరుతో పాటు అశ్లీల ఫోటోలను వెబ్ సైట్లో పోస్టు చేశాడు.  
 
సోషల్ మీడియాలో ఫోన్ నెంబర్ పెట్టేయడంతో ఫోన్లు పదే పదే రావడంతో తీవ్ర మనోవేదనకు గురైన యువతి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యూసుఫ్‌ను అరెస్టు చేశారు.