కార్తీక మాసం... దీపారాధన వల్ల పుణ్యంతోపాటు ఆరోగ్యం కూడా...

దీపారాధనకు భారతీయ సంస్కృతిలో విశిష్ఠ స్థానం ఉంది. కార్తీకమాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీపారాధన వల్ల వచ్చే పుణ్యం సంగతి పక్కన పెడితే, దీనివల్ల దేహానికి కలిగే ప్రయోజనం కూడా ఉందని ఆయుర్వేద శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శనివారం, 29 అక్టోబరు 2016 (21:46 IST)
దీపారాధనకు భారతీయ సంస్కృతిలో విశిష్ఠ స్థానం ఉంది. కార్తీకమాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీపారాధన వల్ల వచ్చే పుణ్యం సంగతి పక్కన పెడితే, దీనివల్ల దేహానికి కలిగే ప్రయోజనం కూడా ఉందని ఆయుర్వేద శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
   
'దీపం జ్యోతిః పరబ్రహ్మం, దీపం సర్వ తమోపహం,
దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే'
దీపపు జ్యోతీ పరబ్రహ్మ స్వరూపం. దీపం అన్ని విధములైన చీకట్లను తొలిగిస్తుంది. దీపారాధన అన్నింటినీ సాధించి పెడుతుంది. అందుకని నేను సంధ్యా దీపానికి నమస్కరిస్తున్నాని పై శ్లోకం అర్ధం. ఒక్కో దీపానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆవు నేతితో వెలిగించిన దీపపు కాంతిని రోజు కనీసం ఒక గంట సమయం అయిన చిన్న వయస్సు నుండి చూడగలిగినట్లైతే దీర్ఘకాలంలో గ్లూకోమా రాదు. 
 
నువ్వుల నూనె దీపపు కాంతి కిరణాలు రోజు కనీసం ఒక గంట పాటు కంటి మీద పడితే కంట్లో శుక్లాలు రావు. ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో వెలిగించిన దీపపు కిరణాలు కంటి దృష్టిని మెరుగుపరుస్తాయి. పూజా సమయంలో దీపం వెలిగించడం చేత ఈ కిరణాలు మన కంటిలోనికి ప్రవేశించి, కళ్ళకు మేలు చేకూర్చుతాయి. ఒక గది మధ్యలో ఆవు నేతి దీపం వెలిగించి, హృద్రోగులు - రక్తపోటుతో బాధపడేవారు – ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యే వారు రోజు ఒక గంట సమయం కనుక ఆ దీపం దగ్గర కూర్చొని చూస్తే కొద్ది రోజులలోనే వారికి ఆరోగ్యం మెరుగుపడుతుందని, రక్తపోటు అదుపులో ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది.

అన్నీ చూడండి

సంగం పెరుగు ప్యాకెట్లో చచ్చిన ఎలుక, షాక్ తిన్న కొనుగోలు చేసిన వ్యక్తి, వీడియో

ఒకప్పుడు ట్రోలింగ్‌లో నేనే నెం.2.. కాన్ఫిడెన్స్‌లో నెం.1: నారా లోకేష్ (video)

అనకాపల్లి జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి

తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ముజిగల్ అకాడమీ కూకట్‌పల్లి 700 మంది విద్యార్థుల నమోదు

అన్నీ చూడండి

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

తర్వాతి కథనం
Show comments