దీపావళి స్పెషల్.. కొబ్బరి బొబ్బట్లు ఎలా చేయాలి

ముందుగా కొబ్బరి తురుము, బెల్లాన్ని ఓ ప్యాన్‌లో వేసి సన్నని సెగపై ఫ్రై చేయాలి. కొబ్బరి, బెల్లం ఉడికి ముద్దలా అయి తీగపాకం వచ్చాక దించాలి. తర్వాత బాగా మెదిపి యాలకుల పొడి, దోరగా వేయించిన గసగసాలు వేయాలి. త

మంగళవారం, 17 అక్టోబరు 2017 (10:39 IST)
దీపావళి వచ్చేసింది.. ఈ పండుగలో తీపి పదార్థాలకు ప్రత్యేక స్థానముంది. పిండి వంటలు, తీపి పదార్థాలను ఇంట తయారు చేసి.. ఇరుగుపొరుగు వారికి బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి దీపావళి పండుగ రోజున కొబ్బరి బొబ్బట్లను ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు 
కొబ్బరి తురుము - మూడు కప్పులు 
మైదా - అరకేజీ, 
యాలకులు - మూడు, 
నూనె లేదా నెయ్యి - వంద గ్రాములు, 
గసగసాలు - వంద గ్రాములు.
బెల్లం లేదా పంచదార - పావుకేజీ,
 
తయారీ విధానం: 
ముందుగా కొబ్బరి తురుము, బెల్లాన్ని ఓ ప్యాన్‌లో వేసి సన్నని సెగపై ఫ్రై చేయాలి. కొబ్బరి, బెల్లం ఉడికి ముద్దలా అయి తీగపాకం వచ్చాక దించాలి. తర్వాత బాగా మెదిపి యాలకుల పొడి, దోరగా వేయించిన గసగసాలు వేయాలి. తర్వాత ఈ కొబ్బరి ముద్దను నిమ్మకాయ సైజులో ముద్దలుగా చేసుకోవాలి. మైదాపిండిలో నీళ్లుపోసి చపాతీ పిండిలా కలిపి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. 
 
ఈ మైదాను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని ఒక్కోదాన్ని చిన్నపూరీలా ఒత్తి, అందులో కొబ్బరి ముద్ద పెట్టి పూరీతో చుట్టేసి చేత్తో లేదా అప్పడాల కర్రతో సున్నితంగా వత్తాలి. వీటిని బొబ్బట్ల మాదిరిగానే పెనం మీద నెయ్యి లేదా నూనె వేసి రెండువైపులా దోరగా కాల్చాలి. అంతే కొబ్బరి బొబ్బట్లు రెడీ.

అన్నీ చూడండి

స్వరితం 2026 శీర్షికన తమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న ముజిగల్ మల్కాజ్‌గిరి అకాడమీ

సీఎం విజయ్ బాటలో సూర్య రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఎలా వుంటుంది?

హైదరాబాదులో వర్షాలు.. పెరుగుతున్న అనారోగ్య సమస్యలు.. జాగ్రత్తలు

Ambani Hospital: అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్.. ఎందుకు?

రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసు : కృష్ణలంక పీఎస్ హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటు

అన్నీ చూడండి

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments