మిక్సెడ్ ఫ్రూట్స్‌తో బ్రెడ్ కస్టర్డ్ ఎలా చేయాలి?

గురువారం, 11 జూన్ 2015 (19:32 IST)
పండ్లు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తాజా పండ్లను తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాంటి ఫ్రూట్ మిక్స్‌తో బ్రెడ్ కస్టర్డ్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
బ్రెడ్‌ స్లయిస్‌లు - పది 
మిక్స్‌డ్‌ ప్రూట్స్ ‌(మామిడి, అనాస, ఆపిల్‌, కివీస్‌, ద్రాక్ష, స్ట్రాబెర్రీ మొదలైనవి)- 350 గ్రాములు 
ఆరెంజ్ జ్యూస్ - అర లీటరు 
పాలు - అరలీటరు
కస్టర్డ్‌ పౌడర్‌  - రెండున్నర టీ స్పూన్లు
పంచదార పొడి - వంద గ్రాములు 
 
తయారీ విధానం:
ముందుగా కస్టర్డ్‌ పౌడర్‌ని 2 టేబుల్‌ స్పూన్ల పాలలో ఉండలు చుట్టకుండా కరిగించి పక్కనుంచుకోవాలి. మిగతా పాలలో పంచదార పొడి వేసి వేడిచేయాలి. పాలు మరుగుతుండగా కస్టర్డ్‌ మిశ్రమాన్ని వేసి చిక్కబడనిచ్చి దించి రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు ఉంచాలి.

పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకొని కస్టర్డ్‌ మిశ్రమాన్ని, వీటిని విడిగా ఫ్రిజ్‌లో ఉంచాలి. తినడానికి ముందు బౌల్‌లో కొంత కస్టర్డ్‌ మిశ్రమం వేసి పైన ఒక బ్రెడ్‌ స్లయిస్‌ను ఉంచి అది నానేలా పైన కమలారసం వేయాలి.మళ్లీ కస్టర్డ్‌ మిశ్రమాన్ని కొంత పోసి పైన తరిగిన పండ్ల ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. 

అన్నీ చూడండి

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

Show comments