ఫ్రూట్స్ అండ్ డేట్స్‌తో ఎనర్జీ సలాడ్ ఎలా చేయాలో తెలుసా?

గురువారం, 20 నవంబరు 2014 (17:15 IST)
ఆరోగ్యంగా ఉండాలంటే.. డేట్స్ సలాడ్ ట్రై చేయండి. 
కావలసిన పదార్థాలు :
క్యాలీఫ్లవర్ తరుగు : అరకప్పు 
డేట్స్ తరుగు : ఒక కప్పు 
కమలాపండు, ఆపిల్స్ ముక్కలు- అర కప్పు 
నిమ్మరసం - అర టేబుల్ స్పూన్ 
నిమ్మ తొనలు - అర టీ స్పూన్ 
నూనె - అర టేబుల్ స్పూన్ 
వెనిగర్ - అర టేబుల్ స్పూన్ 
ఉప్పు - తగినంత 
మిరియాల పొడి- ఒక టీ స్పూన్ 
కమలాపండ్లు- గార్నిష్ కోసం.. 
గట్టిపెరుగు- ముప్పావు కప్పు 
కమలాపండ్ల రసం - 4 టీస్పూన్లు 
ఆవ పొడి - అర టీ స్పూన్ 
పంచదార పొడి - అర టీ స్పూన్ 
ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం: 
ఒక పాత్రలో గట్టి పెరుగు, కమలాపండ్ల రసం, ఆవ పొడి, పంచదార పొడి, ఉప్పు అన్నీ వేసి బాగా కలిపి సుమారు అరగంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. 
 
ఒక పాత్రలో తరిగిన క్యాలీఫ్లవర్‌కి కొద్దిగా నీళ్లు జతచేసి, ఆవిరి మీద ఐదు నిమిషాలు ఉడికించి చల్లార్చాలి. నూనె, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి బాగా కలిపి ఊరనివ్వాలి. 
 
ఒక పాత్రలో ఉడికించిన క్యాలీ ఫ్లవర్, సన్నగా తరిగిన ఖర్జూరాలు, అరటి పండ్లు ముక్కలు, కమలాపండు తొనలు, ఆపిల్ ముక్కలు, నిమ్మరసం, సన్నగా తరిగిన నిమ్మ తొనలు, నూనె, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. తయారుచేసి ఉంచుకున్న కమలాపండ్ల డ్రెసింగ్ వేసి చల్లగా అందించాలి.

అన్నీ చూడండి

Little Girl: ముళ్లపందితో చిన్నారి స్నేహం.. వీడియో వైరల్

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం- రెండు లారీల ఢీ.. నలుగురు సజీవదహనం

జూలై 1, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది..?

గ్రామీణ భారతదేశంలో వర్షాకాలంలో పెరుగుతున్న పాముకాటును ఎదుర్కోవడానికి బీఎస్వీ 4ఏ వ్యూహం

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కేసు.. సస్పెన్స్ వీడింది.. ఎక్కడున్నారంటే?

అన్నీ చూడండి

నా సిక్స్ ప్యాక్ ఇది.. మళ్లీ కలుద్దాం.. సమంత బేబీ బంప్ ఫోటో వైరల్

EVV satyanarayana: అల్లరి నరేష్ నటించిన ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్ కాబోతోంది

తమిళనాట మరో జయమ్మగా త్రిష.. లారెన్స్ అలా చెప్పడంతో త్రిషకు డిప్యూటీ సీఎం పోస్ట్?

Vijay Deverakonda: హైదరాబాద్ వాలీబాల్ ప్లేయర్స్ ను సపోర్ట్ చేసిన విజయ్ దేవరకొండ

Mahesh Babu: మేజిక్‌ అంటే గారడి కాదు., దృశ్య కావ్యం గా రావు బహదూర్ : మహేష్ బాబు

Show comments