టీనేజర్ల కోసం సూపర్ ఫుడ్: పాస్తా విత్ వెజిటబుల్ సాస్!

సోమవారం, 5 జనవరి 2015 (15:06 IST)
టీనేజర్లలో శక్తి లభించాలంటే.. వెజిటబుల్ పాస్తాను తీసుకోవచ్చు. టీనేజర్లు సరైన సమయంలో ఆహారం తీసుకోకపోతే.. వారిలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. తద్వారా శరీరానికి అందాల్సిన ఐరన్, క్యాల్షియం తగ్గే అవకాశం ఉంది. అందుచేత టీనేజర్లు బలంగా ఉండాలంటే.. వారికి ఐరన్ లభించాలంటే.. వెజిటబుల్ పాస్తాను ట్రై చేయండి అంటున్నారు... న్యూట్రీషన్లు. 
 
కావలసిన పదార్థాలు : 
ఆలివ్ నూనె: 2 టేబుల్ స్పూన్లు 
ఉల్లిపాయ తరుగు : అర కప్పు 
వెల్లుల్లి, లవంగాల పేస్ట్ : ఒక టీ స్పూన్ 
జీలకర్ర పేస్ట్ : రెండు టేబుల్ స్పూన్లు 
టమోటా పేస్ట్: ఒక టేబుల్ స్పూన్ 
టమోటా తరుగు : రెండు కప్పులు 
స్పాగెట్టీ: మూడు కప్పులు 
క్యారట్ తరుగు : అర కప్పు 
ఫెటా తరుగు: ఒక కప్పు 
ఆకుకూర కాడల తరుగు : అర కప్పు   
 
తయారీ విధానం : 
పొయ్యి మీద పాన్ పెట్టి మీడియం మంటపై ఆలివ్ నూనె వేసి వేడి చేయాలి. దానిలో ఉల్లిపాయ, క్యారట్, ఆకుకూరల కాడలు వేసి కలుపుతూ తక్కువ వేడిలో మెత్తగా అయ్యేవరకు 5 నిముషాలు ఉంచాలి. తర్వాత వెల్లుల్లి లవంగాల పేస్ట్, జీలకర్ర, టమోటా పేస్ట్, టమోటా ముక్కలు అర కప్పు నీరు చేర్చి.. కొంచెం మరిగాక ఉప్పు, మిరియాలు వేయాలి. ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. 
 
అదే సమయంలో ప్యాకెట్ సూచనల ప్రకారం మరిగే ఉప్పునీటిలో స్పాగెట్టీ‌ని ఉడికించాలి. వార్చిన స్పాగెట్టీ‌ని సాస్‌కు జోడించండి. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని తయారు చేసుకున్న పాస్తా విత్ కాయధాన్యాల సాస్‌కు ఫెటాను జోడించి వేడి వేడిగా సర్వ్ చేయండి. 

అన్నీ చూడండి

విద్యార్థినికి 60 మార్కులు వస్తే 5 మార్కులుగా చూపించిన లెక్చరర్, డిబార్ చేసిన అధికారులు

అమ్మా క్యాంటీన్లలో రుచికరమైన ఆహారం అందించండి.. సీఎం విజయ్ ఆదేశాలు

నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ - ఎన్టీఏ అధికారులకు సమన్లు

రోడ్లపై నమాజ్ చేస్తే ఊరుకోం : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

స్కార్పియో, పది లక్షలు, బంగారం, 16 ఉంగరాలు ఇచ్చినా సరిపోలేదు.. వివాహితను ఏం చేశారు?

అన్నీ చూడండి

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

Show comments