Daily Horoscope
✕

బతుకమ్మ జాతర.. తొమ్మిది రోజులు.. తొమ్మిది నైవేద్యాలు

Written By సెల్వి
Updated: మంగళవారం, 10 అక్టోబరు 2023 (16:22 IST)
బతుకమ్మ జాతర వచ్చేస్తోంది. తొమ్మిది రోజులపాటు రోజుకు ఒక రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శెనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు తొమ్మిది రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. 
 
మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. కానీ చివరి రోజు అయినా సద్దుల బతుకమ్మ నాడు మాత్రం నైవేద్యాన్ని మహిళలే తయారుచేస్తారు.
 
1. ఎంగిలి పూల బతుకమ్మ: మహాలయ అమావాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పించాలి. 
 
2. అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి. 
 
3. ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పించాలి. 
4. నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి. 
5. అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పించాలి. 
6. అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. ఈనాడు  నైవేద్యమేమి సమర్పించరు. 
7.  వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పించాలి. 
8.  వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించాలి. 
9. సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి. 
 
తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేస్తారు. గానాబజానాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. పూలతో తయారు చేసిన బతుకమ్మ శిరస్సుపై కొలువుంచిన పసుపుతో తయారు చేసిన గౌరవమ్మను మహిళలు తమ మాంగళ్యానికి అంటే పుస్తెకు పూసుకుంటారు. 
 
దీనివల్ల తమ మాంగళ్యం అంటే తమ భర్తను ఆపదల నుంచి కాపాడి చల్లగా చూస్తుందని విశ్వాసం. రొట్టె, బెల్లం లేదా చక్కెర కలిపి తయారు మాలీదను అందరికీ పంచితే శుభం జరుగుతుంది.

అన్నీ చూడండి

నాది కాని దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు, యలహంక ఇల్లు నాదే: వైఎస్ షర్మిల

మత్స్యకారులకు అండగా పవన్ కల్యాణ్.. పడవలకు బీమా కల్పించే అంశంపై పరిశీలన

సౌదీ అరేబియాకు విమాన సర్వీసులు నిలిపివేత

సీఈసీపై ప్రజా అభిశంసన - దమ్ముంటే చర్చకు రమ్మన్న అమిత్ షా

దోమల బెడద.. ఆదిలాబాద్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు

అన్నీ చూడండి

31-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు - అనవసరమైన హామీలు ఇవ్వవద్దు...

30-10-2026 శుక్రవారం నాటి రాశి ఫలాలు - ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది..

What Is a Pralaya: ప్రళయం అంటే ఏమిటి? ప్రపంచం నాశనమవుతుందా? ఎలా లెక్కిస్తారు?

29-10-2026 గురువారం నాటి రాశి ఫలాలు - శుభకార్యం జరిగే అవకాశం ఉంది

28-10-2026 బుధవారం నాటి రాశి ఫలాలు - కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు

తర్వాతి కథనం
Show comments