గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By kowsalya
Last Updated : బుధవారం, 9 మే 2018 (17:56 IST)

హనుమజ్జయంతి.. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుంటే?

కరీంనగర్ పట్టణానికి 35 కిలో మీటర్ల దూరంలో వెలసిన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం చాల పురాతనమైనది ఇంకా మహిమాన్వితమైంది. త్రేతాయుగంలో ఇక్కడ ఋషులు యాగయజ్ఞాదులు చేసుకుంటున్న సమయంలో, ఆంజనేయుడు, లక్ష్మణుడి

కరీంనగర్ పట్టణానికి 35 కిలో మీటర్ల దూరంలో వెలసిన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం చాల పురాతనమైనది ఇంకా మహిమాన్వితమైంది. త్రేతాయుగంలో ఇక్కడ ఋషులు యాగయజ్ఞాదులు చేసుకుంటున్న సమయంలో, ఆంజనేయుడు, లక్ష్మణుడి రక్షణార్థం సంజీవ పర్వతం తీసుకొని వెళ్ళసాగాడు. దాన్ని గమనించిన ఋషులు స్వామి వారిని ఆహ్వానించగా, వాయుసుతుడు త్వరగా వెళ్ళాలి, తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు.


ఆంజనేయుడు వస్తానని అని రాలేదు, ఇలా చేయడం వల్ల ఋషులు చేస్తున్న దైవ కార్యక్రమాలను శక్తులు ఆటంకపరిచాయి. దీంతో ఋషులు హనుమన్నను తలచి తపస్సు చేపట్టారు. చివరికి ఋషులు తపస్సుకు మెచ్చి హనుమ ఇక్కడ స్వయంభుగా వెలిశాడు. అప్పటినుండి ఋషులు స్వామి వారిని ఆరాధిస్తూ వారి కార్యక్రమాలను నిర్విగ్నంగా కొనసాగించారు. 
 
సుమారు 400 సంవత్సరాల క్రితం ఒక యాదవుడు ఆవు తప్పిపోయిందని ఈ కొండప్రాంతంలోకి రాగా అతనికి స్వామి వారు కనిపించి నేను ఇక్కడే పొదలలో ఉన్నాను వెతికి దేవాలయం నిర్మించమని చెప్పి ఆవు జడ జెప్పి అదృశ్యమయ్యాడు. దీంతో ఆ యాదవుడు భక్తుల సాయంతో స్వామి వారి ఆలయాన్ని నిర్మించాడు. అలా స్వామివారి క్షేత్రం కోసం కొండలు, గుట్టలు వెతకడంతో ఆ క్షేత్రం కూడా కొండగట్టుపై వుండటం ద్వారా ''కొండగట్టు'' అని పేరు వచ్చిందని స్థల పురాణం.
 
దేవాలయానికి దక్షిణ దిశలో ఒక బావి ఉన్నది. దానిలోని నీటినే స్వామి వారికి అభిషేక, ఆరాధనా కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటారు. ఆలయ ఆవరణలో శ్రీ వెంకటేశ్వ స్వామి, ఆళ్వారులు, శ్రీ లక్ష్మీదేవి అమ్మ వారి విగ్రహాలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో హనుమాన్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వారు గ్రహదోషంతో సతమతమవుతున్న వారు స్వామి వారిని దర్శించుకుంటే తమ కోరికలు తొందరగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.