Daily Horoscope
✕

'సత్యా'న్ని వధించిన 'రాజు'

Written By PNR
Updated: గురువారం, 8 జనవరి 2009 (16:21 IST)
FileFILE
అది రాష్ట్ర ప్రజలు గర్వంగా చెప్పుకునే కంపెనీ. 'ఇంతింతై వటుడింతే' అన్నట్టుగా ఐటీ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. ప్రపంచంలోని ఐటీ సంస్థల్లో ఒకటిగా పేరుగడించింది. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో రివార్డులు అందుకుంది. రికార్డులు సృష్టించింది. దాదాపు 55 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.

ఇలా.. ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునే ఐటీ కంపెనీ సత్యం కంప్యూటర్స్. ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుంది. సంస్థ ఛైర్మన్ బైర్రాజు రామలింగరాజు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోతూపోతూ.. ప్రస్తుతం కంపెనీ ఉన్న స్థితిగతులను కళ్ళకు కట్టినట్టు వివరించారు. మనస్సులోని మాటను వెల్లడించారు. ఫలితంగా.. కంపెనీ రహస్యం ఒక్కసారి వెలుగులోకి వచ్చింది.

తన కుమారుడుకు సొంతమైన మేటాస్‌ ఇన్‌ఫ్రాను టేకోవర్‌చేసుకునే చర్యల్లో భాగంగా సత్యం అసలు రంగు బయటపడింది. గత నెల రోజుల కాలంలోనే సంస్థలోని లోపాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగుచూశాయి. చివరగా.. రాజు రాజీనామాతో ఒక్కసారిగా సత్యం క్లైమాక్స్‌కు చేరుకుంది.

రాజు రాజీనామాను సత్యం కంప్యూటర్‌‌స సర్వీసెస్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. కంపెనీ తాత్కాలిక సిఈవోగా మైనంపాటి రామ్‌ను నియమించింది. సంస్థ ఉద్యోగులు, వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణకే తాను అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని రామ్ ప్రకటించారు. అయితే.. సత్యం సంస్థకు పోయిన పరువు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఐటీ విఫణిలో ఆయన నిలబెట్టగలడా? అన్నదే వేల డాలర్ల ప్రశ్న.
About Author
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Meenakshi Chaudhary: లక్కీ భాస్కర్ తర్వాత మదర్ రోల్స్ ఆఫర్ చేశారు : హీరోయిన్ మీనాక్షి చౌదరి

జానీ మాస్టర్ భార్య సుమలత వర్సెస్ ఫిలిం ఫెడరేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్.. క్షమాపణలు

జనవరిలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్-2

Deepti Ganta : ప్రొడక్షన్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని డైరెక్షన్ చేయాలి.: దీప్తి గంటా

Rushum: విరాట్ హీరోగా చిరంజీవి నటించిన రుస్తుం టైటిల్ ఖరారు

Show comments