Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

2020 టాప్ లిస్టులో మహేష్ బాబు-కీర్తి సురేష్, ఎక్కడ?

Written By ఐవీఆర్
Updated: మంగళవారం, 15 డిశెంబరు 2020 (11:06 IST)
2020 చివరికి వచ్చేసింది. ఈ ఏడాది కరోనావైరస్ కల్లోలం సృష్టించింది. దీనితో అనేక పరిశ్రమలు కుదేలయ్యాయి. వాటిలో సినీ ఇండస్ట్రీ కూడా వుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 15 మధ్య కాలానికి సంబంధించిన డేటా ఆధారంగా ట్విట్టర్ ఇండియా సోమవారం అత్యధికంగా ట్వీట్ చేసిన దక్షిణ భారత నటుల జాబితాను విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం ఒక్క థియేట్రికల్ విడుదల చేయకపోయినా నెం .2 స్థానం పొందారు.
 
మొదటి స్థానంలో మహేష్ బాబు వున్నారు. సంక్రాంతికి విడుదల చేసిన 'సరిలేరు నీకేవరు' చిత్రంతో విపరీతంగా ట్వీట్స్ పడ్డాయి. ఇప్పుడు 'సర్కారు వారీ పాట'తో వార్తల్లో నిలిచాడు.
మరోవైపు తమిళ సూపర్ స్టార్ విజయ్ 3వ స్థానంలో ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ 4 వ స్థానంలో ఉన్నారు. సూర్య, అల్లు అర్జున్, రామ్ చరణ్, ధనుష్, మోహన్ లాల్, చిరంజీవి ఫాలో అవుతున్నారు. టాప్ 10 జాబితాలో తెలుగు తారలు ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఇది చెబుతోంది.
 
నటీమణులలో కీర్తి సురేష్ అగ్రస్థానంలో నిలిచారు, కాజల్ అగర్వాల్, సమంతా అక్కినేని, రష్మిక మందన్న, పూజా హెగ్డే, తాప్సీ, తమన్నా భాటియా, రకుల్ ప్రీత్ సింగ్, శ్రుతి హాసన్, త్రిష కృష్ణన్ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

అన్నీ చూడండి

సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న విష్ణుప్రియ - నెలకు రూ.33 లక్షల ఆర్జన!? (Video)

ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రం విడుదలలో ఆ తప్పు చేశాం : నిర్మాత విశ్వప్రసాద్

లోకేష్ కనకరాజు నటించిన డిసి.. ఐదు భాషల్లో సోనీ లివ్‌లోకి రాబోతోంది

Vijay Deverakonda: తిరుమలలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (video)

Vishwak Sen: ఈనగరానికి ఏమైంది రిపీట్ నుంచి ఆర్టిస్టుల గ్యాంగ్ కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments