శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. రత్నాల శాస్త్రం
Written By సెల్వి

సోమవారం మహిళలు.. ముత్యాల హారాలు..? ఏడు వారాల నగలంటే?

Ornaments
ఆదివారం సూర్యునికి ఇష్టమైన రోజు కావడంతో కెంపుల కమ్మలూ, హారాలు ధరించాలి. అలాగే సోమవారం చంద్రునికి ఇష్టమైన ముత్యాల హారాలు, గాజులు పెట్టుకోవాలి. మంగళవారం.. కుజునికి ఇష్టమైన రోజు కావడంతో పగడాల దండలూ, ఉంగరాలతో అలంకరించుకోవచ్చు. బుధవారం.. బుధగ్రహానికి ఇష్టమైన రోజు కావడంతో పచ్చల పతకాలూ, గాజులు వేసుకోవాలి. 
 
గురువారం.. బృహస్పతికి ఇష్టమైన రోజు కావడంతో పుష్పరాగపు కమ్మలూ, ఉంగరం వేసుకోవడం మంచిది. శుక్రవారం పూట శుక్రునికి ఇష్టమైన వజ్రాల హారం, ముక్కుపుడుక ధరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. 
 
ఇకపోతే.. శనివారం రోజున శనికి ఇష్టమైన నీలమణితో చేయించుకున్న కమ్మలూ, హారాలు, ముక్కుపుడకా ధరించాలి. ఇవి ఏఢు వారాల నగలు. ఆయా రోజుల్లో ఆయా నవరత్నములతో ఆభరణాలను చేయించుకోవచ్చు. ఆ రోజు ఆ రత్నం సంబంధించి బంగారంతో చేయించి పెట్టుకోవడం ద్వారా అంతకుమించిన వైభోగం ఇంకేమీ వుండదని రత్నాల శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.