Daily Horoscope
✕

గబ్బిలాలు చీకట్లో చూడగలవా?

Written By ఎం
Updated: శనివారం, 17 జులై 2021 (08:48 IST)
పగలైనా, రాత్రయినా గబ్బిలాలు చూడలేవు. వాటికి కళ్లున్నా అవి నామమాత్రమే. కాంతిని గ్రహించే శక్తి వాటికి లేదు. అవి కేవలం నోరు, చెవుల సమన్వయంతో మాత్రమే పరిసరాలను అంచనా వేయగలవు. అంటే ఒక విధంగా అవి చెవులతో చూస్తాయని చెప్పవచ్చు.

అలాగని గబ్బిలాలు తమ కళ్ల ద్వారా చూడలేవని అనుకోకూడదు. వాటి కళ్లు వెలుగు, చీకటుల తేడాను గుర్తించగలవు. తద్వారా వస్తువుల ఆకృతులను తెలుసుకోగలవు. అంతే కాకుండా గబ్బిలాలు తాము అంతకు ముందు సంచరించిన ప్రాంతాలను సులువుగా గుర్తుపెట్టుకోగలవు.
 
గబ్బిలాలు నోటితో అతిధ్వనులను (ultrasonic sounds) చేస్తాయి. మనకి వినబడని ఆ ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణిస్తూ దారిలో ఎదురయ్యే అడ్డంకులను ఢీకొని వెనుదిరుగుతాయి. అలా వెనక్కి వచ్చే ప్రతిధ్వని తరంగాలను వినడం ద్వారా గబ్బిలాలు తమ పరిసరాల్లో ఎలాంటి అడ్డంకి ఉందో గ్రహించగలుగుతాయి.

ఇలా అవి గాలిలో వేలాడదీసి ఉన్న సన్నని తీగెలను కూడా తప్పించుకుని ఎగరగలగడం విశేషం. రాత్రిపూట సంచరించే నిశాచర (nocturnal) జంతువులైన ఎలుకలు, నక్కలు, గుడ్లగూబల కోవలోకే గబ్బిలాలు కూడా వస్తాయి కాబట్టి అవి రాత్రులే సంచరిస్తాయి.

అన్నీ చూడండి

పోలీసులపై తిరగబడిన రాప్తాడు దాడి నిందితుడు... కాల్పుల్లో మృతి?

రాప్తాడు నిందితుడిపై పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు, వీడియో

ఆశ్రయం లేని 5,000 మంది కోసం నీతా ముఖేష్ అంబానీ అనంత ఆశ్రయ్ ప్రాజెక్టుకు నీతా అంబానీ భూమిపూజ

హైదరాబాద్‌లో రూ.200 కోట్లతో తయారీ కేంద్రం ప్రారంభించిన మివి

జ్ఞానేశ్ కుమార్ భూగర్భంలో దాక్కొన్నా బయటకు లాక్కొస్తాం : ఖర్గే హెచ్చరిక

అన్నీ చూడండి

రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో ఆర్‌సీ-17

విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల సీక్వెల్ ఈ నగరానికి ఏమైంది రిపీట్ ట్రైలర్ రాబోతోంది

నువ్వు విలన్ వి ? చనిపోతావా? ఓడిపోతావా? అని నిలదీశిన యశ్ కుమారుడు

Rudravanam PS Series Review: రుద్రవనం పీఎస్ లో మర్డర్ల రహస్యం ఏమిటి? వెబ్ సిరీస్ రివ్యూ

Prakash Raj, ఇచ్చిన సినీ అడ్వాన్సులు వెనక్కి తీస్కుంటున్నారు: ప్రకాష్ రాజ్ భార్య పోనీ

తర్వాతి కథనం
Show comments