1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 23 డిశెంబరు 2014 (17:41 IST)

నాలుక చూసి రోగ నిర్ధారణ..! ఎలా చేస్తారో..?

సాధారణంగా అనారోగ్యంతో ఏ డాక్టర్ వద్దకు వెళ్లినా మొదట చేతి మనికట్టు పట్టుకుని, తర్వాత కళ్లు, నాలుక చూస్తారు. అందులో మనికట్టు ద్వారా హృదయం కొట్టుకునే వేగాన్ని తెలుసుకుంటారనే విషయం అందరికీ తెలుసు.
 
కళ్లను చూడడం ద్వారా అవి ఏ రంగులో ఉన్నాయో చూసి రంగును బట్టి రోగ నిర్ధార చేస్తారు. అదే విధంగానే నాలుకను చూసి కూడా రోగాన్ని వైద్యులు నిర్ధారిస్తారు. అది ఎలాగంటారా...? తెలుసుకోండి మరి.
 
నాలుక చల్లగానూ, గరుకుగానూ, పగుళ్లు కలిగి ఉంటే ఆ వ్యక్తికి వాత సంబంధిత రోగం ఏర్పడి ఉండవచ్చని వైద్యులు అంచనా వేస్తారు. అదే నాలుక బాగా ఎర్రగా ఉంటే పిత్త రోగము అని, నాలుక పాలిపోయినట్లు, జిగటగా ఉంటే కఫరోగము అని డాక్టర్లు గుర్తిస్తారు.
 
మరి నాలుక మిశ్రమ రంగులు కలిగి ఉంటే - మిశ్రమ వ్యాధులు ఉన్నట్లు  అభిప్రాయపడతారు. జ్వరము వచ్చినా, శరీరంలో లోపల జ్వరం ఉన్నా వారిలో నాలుక ముదురు ఎరుపుగా మారుతుంది. ముళ్ళు గుచ్చుకుంటున్నట్లు, తడారిపోతుంటుంది.  ఈ విధంగా అనేక విధాలైన రోగాలకు నాలుకను పరీక్షించి వైద్యులు తగిన మందులు ఇస్తారు.