సమ్మర్ ఈ కూరగాయలు తప్పకుండా తీసుకోవాల్సిందే!
సమ్మర్లో తప్పకుండా శరీరానికి చలవ చేసే కూరగాయలు తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. సమ్మర్ సీజన్‌లో డీహైడ్రేషన్‌ను తగ్గించే కూరగాయలు తీసుకోవాలి. వాటిలో నీటి శాతం ఎక్కువుండేలా చూసుకోవాలి. వేసవిలో కీరదోసను తప్పనిసరిగా తీసుకోవాలి. వేసవిలో ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. డ్రీహైడ్రేషన్ తగ్గిస్తుంది . అలసటను, నీరసాన్ని నివారిస్తుంది. వేసవిలో వచ్చే సాధారణ జబ్బు మలేరియాను నివారిస్తుంది.
అలాగే గుమ్మడికాయ వేసవి సీజన్‌లో శరీరాన్ని కూల్ చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రేగులోని క్రిములను నివారిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. శరీరంలో నీరు ఉత్పత్తి చేయడంతో పొట్లకాయ బెస్ట్‌గా పనిచేస్తుంది. ఇంకా సమ్మర్ డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. ఇందులో ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉండటం వల్ల ఇది వేసవిలో వచ్చే వివిధ రకాల జబ్బులను నివారిస్తుంది. హీట్ సమస్యలకు ఇది చాలా మేలు చేస్తుందని, వీటితో పాటు ఖర్బూజ, వాటర్ మెలోన్ వంటివి తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.