Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీపీకి చెక్ చెప్పే ''పగటి నిద్ర ''

Written By chj
Updated: బుధవారం, 18 మే 2016 (18:31 IST)
పగలు పడుకోవడం మంచిది కాదని చాలా మంది చెబుతుంటారు కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. అధిక రక్తపోటుతో బాధపడేవారు పగటి పూట 45 నిమిషాలు నిద్రపోతే రక్తపోటు వెంటనే నియంత్రణలోకి వస్తుందని తాజా పరిశోధనలో వెల్లడయింది. ముఖ్యంగా ఒత్తిడికి గురయినపుడు ఈ పద్ధతి బాగా ఉపకరిస్తుందని ఇందులో నిరూప‌ణ అయ్యింది. పెన్సిల్వేనియాలోని అల్లెగెనీ కాలేజ్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలో భాగంగా 85 మంది ఆరోగ్యవంతులైన విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించి అధ్యయనం చేశారు.
 
ఒక గ్రూపు వారికి ప్రతి రోజు గంట పాటు మధ్యాహ్నం నిద్రపోయే వెసులుబాటు కల్పించారు. మరొక గ్రూపుకు నిద్రపోయే అవకాశం ఇవ్వకుండా ఏదో ఒక పని చెబుతూ వచ్చారు. తరువాత వారిని రక్తపోటు పరిశీలిస్తే 45 నుంచి 60 నిమిషాల పాటు నిద్రపోయిన వారి రక్తపోటు చాలా తక్కువగా ఉంది. తమ పరిశోధనల్లో వెల్లడయిందేమిటంటే మధ్యాహ్నం నిద్ర వల్ల కార్డియో వాస్క్యులర్ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. మెంటల్ స్ట్రెస్ తగ్గిపోతుందని పరిశోధనలో పాలుపంచుకున్న ర్యాన్ బ్రిండిల్ తెలిపారు.

అన్నీ చూడండి

ప్రాంతీయ భారతీయ వంటకాలతో హైదరాబాద్ రూఫ్‌టాప్ రెస్టో-బార్ వాయు ప్రారంభం

అంతర్జాతీయ హ్యాపీ పెట్స్ డే: వేడుకగా నిర్వహించిన సికింద్రాబాద్, బేగంపేట్‌లోని జిగ్లీ పెట్ కేర్

ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా... మాల మహానాడు నేతపై టీడీపీ ఎమ్మెల్యే ఫేర్ (వీడియో)

నా కుమార్తెకు ప్రధాని మోడీ కొత్త జీవితాన్ని ప్రసాదించారు

అంగరంగ వైభవంగా లష్కర్ బోనాలు ప్రారంభం - పోటెత్తిన భక్తులు

అన్నీ చూడండి

నెమ్మదించిన కెరీర్ - పెళ్లి పీటలెక్కనున్న బుట్టబొమ్మ

గ్లామర్ అంటే జీరో సైజ్ శరీరాకృతి మాత్రమేనా? బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ ప్రశ్న

తెలంగాణ అంటే తాగడం - ఆంధ్రా అంటే తిండి అనడం తప్పు : నటుడు నరేశ్

Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్.. టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్

Manasa Chowdary : లవ్ జాతర నుంచి మానస చౌదరి బర్త్ డే పోస్టర్

తర్వాతి కథనం
Show comments