కంప్యూటర్ విజన్ సిండ్రోమ్.... నాక్కూడా వుందేమో...?! తెలుసుకునేదెలా..?!!

అవును... ఇప్పుడు ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ నాక్కూడా ఉండే వుంటుందేమో అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంప్యూటర్, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ లేదా టీవీ... ఈ నాలుగింటిలో ఏదో ఒక సాధనంతో పొద్దస్తమానం కాలం గడిపేస్తుంటే... ఇక డౌటే లేదు కంప్యూటర్ విజన్ స

శుక్రవారం, 3 జూన్ 2016 (16:50 IST)
అవును... ఇప్పుడు ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ నాక్కూడా ఉండే వుంటుందేమో అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంప్యూటర్, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ లేదా టీవీ... ఈ నాలుగింటిలో ఏదో ఒక సాధనంతో పొద్దస్తమానం కాలం గడిపేస్తుంటే... ఇక డౌటే లేదు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఉన్నట్లే. ఈ రకం అలవాటుతో ఇప్పుడు ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో 70 నుంచి 90 శాతం సతమతమవుతున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 
 
డిజిటల్ వరల్డ్ పుణ్యమా అంటూ ఇప్పుడు కంప్యూటర్లు, ల్యాప్ టాపులు, ట్యాబులు, మొబైల్ ఫోన్లు, టీవీలు ఇలా అనేక సాధనాల్లో మనక్కావాల్సిన సమాచారం దొరుకుతుంది. దీనితో వాటితోటిదే లోకం అన్నట్లు చాలామంది గడిపేస్తున్నారు. ఓ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో 7 కోట్ల మందికి పైగా ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ బారిన పడినట్లు చెపుతున్నారు. దీని ప్రభావం ఏంటయా అంటే... పొద్దస్తమానం ఆ సాధనాల ముందు తప్ప ఇక వారు ఎక్కడా ఎక్కువగా కనిపించరు. దీనితో అతి పిన్నవయసులోనే కంటిచూపు మందగించి తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారు. ఇది చాలా తీవ్రమైన అనారోగ్య సమస్య అని వైద్యులు చెపుతున్నారు.
 
ఈ సిండ్రోమ్ ఏం చేస్తుంది...?
కంప్యూటరుతో పనిచేసేటపుడు, మొబైల్ గేమ్స్ ఆడేటపుడు, టీవీ చూస్తున్నప్పుడు కంటి రెప్పలను ఆర్పకుండా చూడటం ఎక్కవవుతుంది. సహజంగా అయితే నిమిషానికి కనీసం మూడు నుంచి నాలుగుసార్లు కంటి రెప్పలను మూసితెరవడం జరుగుతుంది. కంప్యూటర్ వర్క్ చేసేవారిలో ఇది జరుగదు. దీనితో కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. కంటికి సమస్య అధికం చేయడం కారణంగా కంటిచూపు మందగించడం జరుగుతుంది. 
 
సమస్య అధికమయ్యిందని గుర్తించడమెలా...?
పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం... డిజిటల్ స్క్రీన్లను అదేపనిగా ఉపయోగించడం వల్ల కళ్లకు పలు సమస్యలను కలిగిస్తాయి. ఒక చిత్రం రెండుగా కనబడటం, బ్లర్ గా కనిపించడం, కళ్లు మండుతున్నట్లు అనిపించడం, కళ్లలో దురద, మంట, ఎండిపోయినట్లుగా అనిపించడం, ఎర్రబారటం వంటివన్నీ ఈ సమస్య కిందికే వస్తాయి. కంటితోనే వదలకపోవచ్చు. తలనొప్పి, మెడ నొప్పి, వెన్నునొప్పి, మానసికంగా ఒత్తిడి వంటివి కూడా వెంటాడుతాయి.
 
వదిలించుకోవడం ఎలా?
వృత్తిని అనుసరించి కంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులను సంప్రదించి ఐ డ్రాప్స్ తీసుకుంటూ ఉంటే సమస్యను అధిగమించవచ్చు.
-ఎంతోసేపు కంప్యూటర్ వర్క్ చేసి ఉంటారు కనుక కళ్లు బాగా అలసిపోయి ఉంటాయి. కనుక బయటకు వెళ్లేటపుడు తగిన కళ్లద్దాలను పెట్టుకుని వెళ్లాలి.
-యాంటి-రిఫ్లెక్షన్ కంప్యూటర్ స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి
- కంప్యూటర్ పని చేసేటపుడు కంటి రెప్పలను ఆర్పకుండా అలానే చూడొద్దు. కనీసం 10 నిమిషాలకోసారి చూపును పక్కకు తిప్పి విశ్రాంతినివ్వాలి.
-ఏసీకి మరీ దగ్గర్లో కూర్చుని పని చేయవద్దు. ఆ గాలి కూడా కళ్లపై ప్రభావం చూపుతుంది.
- ప్రతి గంటకోసారి కుర్చీలోంచి లేచి అలా బయటకు వెళ్లాలి.
- కంప్యూటర్ పనిచేస్తున్నప్పుడు కళ్లజోడు లేకుండా చేయవద్దు. వైద్యుడిని సంప్రదించి ఖచ్చితంగా కళ్లజోడు ధరించాలి. లేనట్లయితే త్వరగా కంటిచూపు మందగిస్తుంది.
-ప్రతి అర్థగంటకోసారి కళ్లను మూసుకుని కాస్తంత విశ్రాంతినివ్వాలి. 
- కళ్లు మండుతున్నాయి అని ఏదో మెడికల్ షాపులో ఐ డ్రాప్స్ కొనేసి వేసుకోరాదు. అవి ప్రమాదం కలిగించవచ్చు.
- కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ దరి చేరకుండా ఉండాలంటే పై జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

అన్నీ చూడండి

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments