ganesh chaturthi

చల్లని వాతావరణంతో ఆస్తమాతో మరింత ఇబ్బంది... ఎందుకు వస్తుంది?

Written By సిహెచ్
Updated: గురువారం, 12 నవంబరు 2020 (23:03 IST)
వర్షాకాలం, శీతాకాలం వస్తుందంటే చాలు ఆస్తమా వున్నవారు అదిరిపోతుంటారు. అంటే.. ఎండాకాలంలో ఇది రాదని కాదు. ఎక్కువగా చల్లగా వున్నప్పుడే ఇది తలెత్తుతుంది. ఆస్తమా, సైనసైటిస్ ఈ రెండూ వేర్వేరు వ్యాధులైనప్పటికీ ఒకదానికొకటికి సంబంధం వుంది. దీర్ఘకాలంగా సైనసైటిస్‌తో బాధపడుతున్నప్పుడు అది ఆస్తమాగా మారే అవకాశం ఎక్కువ.
 
అసలు ఆస్తమా రావడానికి కారణాలు ఏమిటి అని చూస్తే...  5 మైక్రాన్ల కన్నా తక్కువ వుండే కణాలు సైనస్‌లో ఆగకుండా నేరుగా ఊపిరితిత్తులలోకి వెళ్లిపోతాయి. వీటిని బయటకు పంపించేందుకు శరీరం విశ్వప్రయత్నం చేస్తుంది. ఫలితంగానే తుమ్ములు వస్తాయి. అంతేకాకుండా వాతావరణ కాలుష్యం, ఇంట్లో పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, దుమ్ము, ధూళి ఎక్కువగా వుండే ప్రదేశాల్లో వుండటం వల్ల కూడా ఆస్తమా వచ్చేందుకు కారణమవుతుంది. 
 
ఆస్తమా లక్షణాలు....
తరచూ జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడటం అనేది సైనస్ వ్యాధి ప్రాథమిక లక్షణం. ఆ తర్వాత దశలో జలుబు చేసినప్పుడు ముక్కులు బిగదీసుకుపోవడం వుంటుంది. తల బరువుగా అనిపించడమే కాకుండా ముక్కు నుంచి ఆకుపచ్చని, పసుపచ్చని ద్రవం కారుతుంటుంది. ఆస్తమాలో ప్రధానంగా కనిపించేవి దగ్గు, ఆయాసం, పిల్లికూతలు. కొందరిలో అయితే దగ్గు మాత్రమే కనిపిస్తుంది. ఛాతీ పట్టేసినట్లు బరువుగా అనిపిస్తుంది.
 
దీన్ని నిరోధించేందుకు హోమియో మందులు కూడా వున్నాయి. ఈ మందుల వల్ల ఆస్తమాను శాశ్వతంగా నిరోధించవచ్చని వైద్యులు చెపుతున్నారు. ఇంగ్లీషు మందుల ద్వారా ఆస్తమాను తరిమేయడం సాధ్యం కాదని అంటున్నారు.

అన్నీ చూడండి

ఇంట్లో సీసీటీవీ కెమెరాలు పెడతావా? మామను చంపించిన కోడలు

మహిళా పోలీసుతో జుట్టూ జుట్టు పట్టుకుని కిందపడి కొట్టుకున్నారు, వీడియో

ప్రియుడితో వీడియో వైరల్..యువతిని మట్టుబెట్టిన తండ్రి, సోదరుడు... ఎక్కడ?

డీఎస్సీపై వైకాపా చీఫ్ జగన్ ప్రశ్నల వర్షం... కుమారుడిని కాపాడుతున్న సీఎం బాబు

1980స్ రెట్రో ఏఐ ఫోటో ట్రెండ్‌‌లో భాగమైన రేవంత్ రెడ్డి.. రెట్రో లుక్ అదుర్స్.. పాతతరం హీరోలా?

అన్నీ చూడండి

Ibomma: ఓవర్ ది నైట్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసి ఐ బొమ్మ\ షూటింగ్ కంప్లీట్ చేశాం : డైరెక్టర్ విజయ్

జి.వి.ప్రకాష్ కుమార్ ఆవిష్కరించిన చకోర లోని ధమ్ ధమ్ సాంగ్

Ayush Tejas: శరత్ బాబు వారసుడు ఆయుష్ తేజస్ టాలీవుడ్ ఎంట్రీ

Sardar 2 Review: సర్దార్ 2 చిత్రం కార్తీ కి కలిసి రాలేదా? సర్దార్ 2 రివ్యూ

Udayabhanu: పంచనామాకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా : ఉదయభాను ఎమోషనల్

తర్వాతి కథనం
Show comments