మెనోపాజ్ అంటే ఏంటి..? అధిగమించడానికి ఏం చేయాలి?

woman
సిహెచ్| Last Modified సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (22:14 IST)
మెనోపాజ్ (రుతుక్రమం ఆగిపోయే దశ) జీవితంలో ప్రతి మహిళా ఎదుర్కొనే ఓ దశ. సహజంగా 50 నుంచి 55సంవత్సరాల లోపు వయస్సులో ఈ దశ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి ప్రతినెలా క్రమం తప్పకుండా వచ్చే రుతుక్రమం నుంచి తప్పించుకునే అవకాశం లభిస్తుంది. ఈ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు నియమాలు గురించి చాలామందికి అవగాహన ఉండదు. కానీ మనం తీసుకునే ఆహారమే మెనోపాజ్ ముందుగా వచ్చేందుకు దోహదం చేస్తుందన్న విషయం పెద్దగా తెలియదు. అలాంటి వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

మెనోపాజ్ దశ రావడానికి ప్రధాన కారణం హార్మోన్లే. రుతుక్రమం ప్రారంభం అయినప్పటి నుంచి విడుదలయ్యే అండాలు హార్మోన్లు విడుదల క్రమంగా తగ్గిపోవడం ఈ దశ లక్షణం. ఈ దశకు ముందు రుతుక్రమం అస్తవ్యస్తమవుతుంది. కొందరికి నాలుగైదు నెలల వరకు రుతుక్రమం రాకపోవచ్చు. మరికొందరికి యేడాది వరకు రాకపోవచ్చు. అది వారి వారి శరీరతత్వ్యం మీద ఆధారపడి ఉంటుంది.

ఈ దశ ప్రారంభం కావడానికి యేడాది రెండు సంవత్సరాల ముందు నుంచే దీని లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. అవన్నీ తాత్కాలిక సమస్యలు గానే గుర్తించాలి. వాటిని అధిగమించడానికి మందుల కన్నా ఆహారంలోనూ జీవన విధానంలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లకు పీరియడ్స్‌ను నియంత్రించే శక్తి ఉంటుందట. అందుకే అవి ఎక్కువగా ఉండే ఆహారం మెనోపాజ్ పై ప్రభావం చూపుతుందట. మరో పక్క రిఫైన్డ్ కార్పొహైడ్రేట్లకు మెనోపాజ్‌ను వేగవతం చేసే గుణం ఉంటుందట.దీనిపై మరింత చదవండి :