Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం పప్పు, బాదం పాలు తీసుకుంటే ఏం జరుగుతుంది?

Written By సిహెచ్
Updated: గురువారం, 21 నవంబరు 2019 (22:10 IST)
ఆరోగ్యానికి సహజసిద్ధమైన పదార్థాలను తీసుకుంటూ వుండాలి. బాదం పప్పు శరీర ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మంచిది. పోషకాహారంగానే గాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం పనికొస్తుంది.

బాదంను అలాగే వాడే కంటే, ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి, పైన ఉన్న పొరలాంటి తొక్కను తీసేసి, ముద్దగా నూరి వాడడం మంచిది. ఇలా చేయడం వల్ల బాదం పప్పు సరిగ్గా అరిగి శరీరానికి వంటబడుతుంది. అప్పుడే శరీరానికి ఎక్కువ ప్రయోజనాలను చేకూర్చుతుంది. 
 
బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలి.. బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వారకూ కలపాలి. అంతే బాదం పాలు రెడీ. బాదంలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇందులో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్స్ గురించి పెద్దగా పట్టించుకోవల్సిన అవసరం లేదు. అందుకే మీ ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. బాదం మిల్క్ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 
బాదం మిల్క్‌లో సోడియం తక్కువగా ఉండటం, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే ఫిష్‌లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో అధికంగా ఉంది. అందువల్ల ఇది హార్ట్ డిసీజ్ లను మరియు బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. ఇకపోతే.. బాదం పాలు కండరాలు బలోపేతం అవుతాయి. నొప్పులను నివారిస్తాయి. ఎముకలను బలపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంపొందింపజేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

MLA Raja Singh.. డబ్బు వాటాల పంపిణీ వివాదమే కారణం.. కొండా సురేఖ ఇష్యూపై రాజా సింగ్

వైఎస్ వివేకా హత్య కేసు : రూ.40 కోట్లకు డీల్ - ఈడీ దర్యాప్తు

మంత్రి పదవికి రాజీనామా చేయండి : కొండా సురేఖకు హైకమాండ్ ఆదేశం

ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీ పడుతున్న తమిళనాడు సీఎం విజయ్.. ఏ విషయంలో?

అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తాం : మంత్రి లోకేశ్

అన్నీ చూడండి

Allari Naresh: సురభి మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని కోరుకుంటున్నా: అల్లరి నరేష్

Nag Ashwin: కల్కి 2898 AD' సీక్వెల్ కు గ్రహాలు అనుకూలించడంలేదు

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలకు హాజరైన సాయి దుర్గా తేజ్

రాణి పద్మావతి పిరికిపందనా? నటి స్వర భాస్కర్‌పై బీజేపీ - కర్ణిసేన పైర్

దర్శకుడు సాయి రాజేష్ ఆవిష్కరించిన డియర్ హార్ట్ మోషన్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments