Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

బరువు తగ్గాలనుకుంటే రోజుకో గ్లాసు బీట్ రూట్ రసం తాగండి..

Written By సెల్వి
Updated: గురువారం, 19 డిశెంబరు 2019 (10:56 IST)
బీట్‌రూట్ రసాన్ని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బీట్‌రూట్‌ను నిత్యం తీనేవారికి గుండె సమస్యలు ఉండవని ఇప్పటికే పరిశోధనలు తేల్చాయి. బీట్‌రూట్ వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. బీట్‌రూట్ వల్ల రక్తంలో నైట్రేట్ రెట్టింపవుతుంది. దీనివల్ల కండరాలు చురుగ్గా పనిచేస్తాయి. అంతేగాకుండా.. రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజు బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిది.
 
ఇలా రోజూ గ్లాసుడు బీట్ రూట్ రసం తాగితే రోజంతా ఉత్సాహంగా వుండవచ్చు. ఇది ఎనర్జీ డ్రింక్ కంటే ఎక్కువ ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అలసట కూడా రాదు. బీట్‌రూట్‌లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, సిలు ఎదిగే పిల్లలకు తోడ్పడతాయి. పిల్లలు రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్‌ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
 
గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే కడుపులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందుతుంది. బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది.
 
బీట్ రూట్ జ్యూస్‌ను రోజూ తాగితే హైబీపీ సమస్య ఉండదు. గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. ముఖ్యంగా బీట్ రూట్ రసం కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ వల్ల లివర్ శుభ్రమవుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments