సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 మార్చి 2017 (12:51 IST)

బరువు తగ్గాలా? నల్లద్రాక్షలను ఎంత ఎక్కువ తింటే అంత మంచిది..

బరువు తగ్గాలనుకునేవారు నల్లద్రాక్షలను ఎంత ఎక్కువ తింటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను తొలగించి.. బరువు తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇందులో ఫ

బరువు తగ్గాలనుకునేవారు నల్లద్రాక్షలను ఎంత ఎక్కువ తింటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను తొలగించి.. బరువు తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ ఆకలి కానీయకుండా చేయడంతో ఆహారాన్ని మితంగా తీసుకుంటామని తద్వారా బరువు తగ్గడం సులభమవుతుంది. అలాగే అధిక రక్తపోటును నియంత్రించుకోవాలంటే రోజూ ఒక కప్పు నల్లద్రాక్షలను తీసుకోవాలి. నల్లద్రాక్షలు రక్తంలోని చక్కెరస్థాయుల్ని అదుపులో ఉంచుతుంది. అలాగే రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. 
 
ఇకపోతే.. వారంలో నాలుగు లేదా ఐదు సార్లు నల్లద్రాక్ష పండ్లను తీసుకోవడం ద్వారా ఏకాగ్రత కుదురుతుంది. అలాగే  జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. వీటిల్లోని పాలీఫెనాల్ మైగ్రేయిన్ తలనొప్పిని, మతిమరుపును అదుపులో ఉంచి.. మెదడు పనితీరును చురుగ్గా మారుస్తుంది. ఇంకా నల్లద్రాక్షలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని ఫైటోకెమికల్స్ గుండెలో పేరుకునే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. అక్కడి కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా హృద్రోగ వ్యాధులు దరిచేరవు. ఇంకా క్యాన్సర్ కారకాలను నల్లద్రాక్షలు నాశనం చేస్తాయని వైద్యులు చెప్తున్నారు.